Asianet News TeluguAsianet News Telugu

ప్రాణాలకు తెగించి సిమెంట్ మిక్సర్ లో 18 మంది వలసకూలీల ప్రయాణం!

మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్ లోని లక్నో వెళ్లేందుకు 18 మంది వలసకూలీలు కాంక్రీట్ మిక్సింగ్ ట్యాంకులో కూచొని బయల్దేరారు. మనిషి ఆ రంధ్రంలో ఎలా పట్టాడు, లోపల 18 మంది ఎలా కూర్చున్నారు అన్న విషయం ఆ భగవంతుడికే తెలియాలి. 

18 Migrants Found In Cement Mixer, migrants Were Trying To Reach Lucknow
Author
Indore, First Published May 2, 2020, 6:14 PM IST

కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల దేశంలో వలస కూలీలు ఎక్కడివారక్కడ చిక్కుబడిపోయారు. వారంతా ఇండ్లకు వెళ్ళనే తపనతో తహమా ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు ఇలాంటిదే ఒక సంఘటన  మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. 

మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్ లోని లక్నో వెళ్లేందుకు 18 మంది వలసకూలీలు కాంక్రీట్ మిక్సింగ్ ట్యాంకులో కూచొని బయల్దేరారు. మనిషి ఆ రంధ్రంలో ఎలా పట్టాడు, లోపల 18 మంది ఎలా కూర్చున్నారు అన్న విషయం ఆ భగవంతుడికే తెలియాలి. 

మహారాష్ట్ర నుంచి యూపీ వెళ్లేందుకు 18 మంది ఆ చిన్న ట్యాంకులో కూర్చున్నారు. అలా మహారాష్ట్ర నుంచి పయనమై, మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లా బోర్డర్ లో పోలీసులు లారీని ఆపారు. డ్రైవర్ టెన్షన్ పడుతుండడం చూసి అనుమానం వచ్చి అధికారులు లారీలో చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. 

వారందరిని కిందకి దింపి క్వారంటైన్ సెంటర్ కి తరలించారు. వారికి ఆహరం అందించి స్క్రీనింగ్ నిర్వహించారు. వారికి లక్నో వరకు వెళ్లేందుకు అధికారులు బస్సును ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 

ఇకపోతే... స్వస్థలాలకు చేరుకున్న వలస కార్మికులకు ఇప్పుడు కరోనా కలవరపెడుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...మహారాష్ట్రలో చిక్కుకున్న కార్మికులు  ప్రభుత్వ బస్సుల్లో ఝాన్సీ పట్టణం మీదుగా యూపీలోని బస్తీ కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వారికి అధికారులు పరీక్షలు నిర్వహించగా వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో కార్మికులందరినీ ఆస్పత్రికి తరలిరంచి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్మికులతో సన్నిహితంగా ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నామన్నారు.

ఇక ముంబై నుంచి ఇటీవల చత్తీస్‌గడ్‌కు చేరుకున్న ఓ వలస కార్మికుడికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో స్థానిక ప్రభుత్వం అప్రమత్తమైంది. కాగా లాక్‌డౌన్‌ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులను స్వస్థలాలకు చేర్చే శ్రామిక్‌ రైళ్ల ప్రయాణం మేడే రోజు ప్రారంభమైన విషయం తెలిసిందే. రైలులోనూ భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ప్రతీ కోచ్‌లో 54 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. స్థానిక అధికారులు నిబంధనల ప్రకారం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం స్వస్థలాలకు చేరుస్తారు. ఇళ్లల్లో కాని, ప్రత్యేక కేంద్రాల్లో కానీ వారిని క్వారంటైన్‌ చేస్తారు

Follow Us:
Download App:
  • android
  • ios