మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ గవర్నమెంట్ హస్పిటల్ లో 24 గంటల వ్యవధిలో 18 మంది మృతి చెందారు. ఈ ఘటనపై సమగ్ర వివరాలు కావాలని కోరుతూ సీఎం షిండే ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

మహారాష్ట్రలోని ఓ గర్నమెంట్ హాస్పిటల్ లో ఒకే రోజు 18 మరణాలు సంభవించాయి. 24 గంటల వ్యవధిలో ఇంత మంది చనిపోవడం స్థానికంగా కలకం రేకెత్తించింది. థానేలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ గవర్నమెంట్ హస్పిటల్ లో ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. 

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్? శరద్ పవార్, అజిత్ పవార్‌ల రహస్య భేటీ

24 గంటల వ్యవధిలో 18 మంది మృతి చెందిన విషయాన్ని ఆదివారం సాయంత్రం డిపార్ట్ మెంట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కమిషనర్ బంగార్‌ అభిజిత్‌ అధికారికంగా ప్రకటించారు. చనిపోయిన వారిలో 10 మంది మహిళలు ఉన్నారు. మరో ఎనిమిది మంది పురుషులు ఉన్నారు. అయితే ఇందులో థానే సిటీకి చెందినవారు ఆరుగురు కాగా.. కల్యాణ్ కు చెందిన నలుగురు ఉన్నారని అభిజిత్ తెలిపారు. అలాగే షాపూర్ కు చెందినవారు ముగ్గురు, మిగితా వారు సిటీలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. 

లిఫ్ట్ ఇస్తామని మహిళపై గ్యాంగ్ రేప్.. తలకు తుపాకీ గురిపెట్టి బెదిరింపు

అయితే మృతి చెందిన 18 మందిలో 12 మందికి 50 ఏళ్లకు పైగా వయస్సు ఉంటుందని అభిజిత్ తెలిపారు. కాగా.. ఈ మరణాలపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఆరా తీశారు. హాస్పిటల్ నుంచి వివరాలు కోరారు. మరణాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో నివేదిక కావాలని ఆయన ఓ స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి.. నంద్యాలలో ఘటన

పోలీసులు ఈ ఘటనపై మాట్లాడుతూ.. మరణించిన 18 మందిలో పలువురు ఆరోగ్యం విషమించిన తరువాత హాస్పిటల్ లో చేరారని, మరి కొందరు వృధాప్యం వల్ల చనిపోయారని డాక్టర్లు చెప్పారని వెల్లడించారు. అయితే ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ గవర్నమెంట్ హస్పిటల్ డీన్ ను ఆదేశించారు.