బీహార్ బోటు ప్రమాదం.. 18 మంది చిన్నారులు గల్లంతు..
బీహార్ లోని ముజఫర్ నగర్ లో పడవ బోల్తా పడి 18 మంది చిన్నారులు గల్లంతయ్యారు.

బీహార్ : బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఈ ఉదయం పడవ బోల్తా పడిన ఘటనలో 18 మంది చిన్నారులు గల్లంతయ్యారు. బాగ్మతి నదిలో పడవలో 34 మంది పిల్లలు పాఠశాలకు వెడుతుండగా ప్రమాదం జరిగింది.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, జిల్లా సీనియర్ అధికారులను ప్రమాద స్థలానికి పంపామని, పిల్లల కుటుంబాలకు సహాయం, కావాల్సిన మద్దతు ఇస్తామని చెప్పారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కు చెందిన ఒక బృందం కూడా సంఘటన స్థలంలో ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.