ఉత్తరప్రదేశ్‌లో 77 మందిని పొట్టనపెట్టుకున్న కల్తీ మద్యం కేసులో పోలీసులు 175 మందిని అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్, యూపీ ప్రాంతాల్లో శనివారం కల్తీసారా సేవించి 77 మంది మరణించిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారణకు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 10 మంది పోలీసులను సస్పెండ్ చేశారు.

అలాగే అక్రమంగా కల్తీ మద్యం తయారు చేయడంతో పాటు విక్రయించే వారిపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ ఘటనలో సంబంధం ఉన్న మొత్తం 175 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 250 లీటర్ల నాటు సారా, 60 లీటర్ల విదేశీ మద్యాన్యి స్వాధీనం చేసుకున్నారు.