బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. బైక్‌పై చెట్టు కూలడంతో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఇల్యాస్ నగర్‌కు చెందిన ఉమర్ పాషా, మహ్మద్ షాహిర్‌లు స్థానిక కళాశాలలో పీయూసీ చదువుతున్నారు.

బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. బైక్‌పై చెట్టు కూలడంతో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఇల్యాస్ నగర్‌కు చెందిన ఉమర్ పాషా, మహ్మద్ షాహిర్‌లు స్థానిక కళాశాలలో పీయూసీ చదువుతున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ క్రమంలో ఆదివారం కావడంతో ఇద్దరు బైక్‌పై చక్కర్లు కొట్టడానికి వెళ్లారు. అయితే కుమారస్వామి లేఔట్‌ సమీపంలో వీరి ద్విచక్ర వాహనం వెళ్తోంది. ఈ సమయంలో రోడ్డు పక్కన వున్న ఒక చెట్టు ఉన్నట్లుండి కుప్పకూలి యువకుల బైక్‌పై పడింది.

ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న ఉమర్ పాషా తల ఛీద్రమైపోయి, అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. వెనుక కూర్చొన్న మహ్మద్ షాహిర్ తీవ్రగాయాల పాలయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న నగర మేయర్ గంగాంభిక ఘటనాస్థలికి చేరుకుని మృతుడి కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం ప్రభుత్వం తరపున రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. జరిగిన ప్రమాదంలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం ఏం లేదని, కూలిన చెట్టు ధృడంగా ఉందని అయితే ఎందుకు నేలకొరిగిందో తెలియదన్నారు.

ఇలాంటి సంఘటనలు జరక్కుండా నగర వ్యాప్తంగా ఉన్న కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న చెట్లను తొలగిస్తామని గంగాంభిక తెలిపారు. అన్నింటికి మించి సదరు యువకులు హెల్మెట్ ధరించకపోవడం విషాదానికి కారణమైందని ఆమె స్పష్టం చేశారు.