టెన్నిస్ స్టార్ చేస్తానని బాలిక మీద కోచ్ అత్యాచారం.. అరెస్ట్..
రాజస్థాన్ లోని జైపూర్ లో దారుణం చోటుచేసుకుంది. నగరానికి చెందిన ఓ 17 యేళ్ల బాలిక మీద తన టెన్నిస్ కోచ్ చేత అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు మరిన్ని టోర్నమెంట్లలో అవకాశాలు ఇప్పిస్తానని, టెన్నిస్ స్టార్ ను చేస్తానని మభ్య పెట్టి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
రాజస్థాన్ లోని జైపూర్ లో దారుణం చోటుచేసుకుంది. నగరానికి చెందిన ఓ 17 యేళ్ల బాలిక మీద తన టెన్నిస్ కోచ్ చేత అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు మరిన్ని టోర్నమెంట్లలో అవకాశాలు ఇప్పిస్తానని, టెన్నిస్ స్టార్ ను చేస్తానని మభ్య పెట్టి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
బాధితురాలు జైపూర్ లోని సవై మాన్ సింగ్ స్టేడియంలో శిక్షణ పొందుతోంది. అయితే ఇటీవల అమ్మాయి ప్రవర్తనలో మార్పు రావడాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో ఆమెను ప్రశ్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తల్లిదండ్రుల దగ్గర కన్నీటిపర్యంతమవుతూ విషయాన్ని వెల్లగక్కింది. గత కొద్ది రోజులుగా తాను అనుభవిస్తున్న నరకాన్ని చెప్పుకొచ్చింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ మేరకు జ్యోతి నగర్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం, ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద సోమవారం అత్యాచారం కేసు నమోదైంది.
ఈ కేసులో నిందితుడైన సదరు టెన్నిస్ కోచ్ ను గౌరంగ్ నల్వాయాగా గుర్తించిన పోలీసులు మంగళవారం సాయంత్రం అతన్ని అరెస్ట్ చేశారు. బాధితురాలైన బాలిక టెన్నిస్ ను తన కెరీర్ గా ఎంచుకుంది.
ఆన్ లైన్ లో విటులను ఆకర్షించి.. లాడ్జిలో వ్యభిచారం..!...
ఆమెకు శిక్షణ ఇస్తున్న నిందితుడైన కోచ్, పెద్ద టోర్నమెంట్లలో ఆడే అవకాశాలిప్పిస్తానని వాగ్దానం చేసి ఆమె మీద పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మొదట్లో కుటుంబసభ్యులకు ఎలాంటి అనుమానం రాలేదు. ఆ తరువాత ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానంతో ప్రశ్నించగా విషయం వెలుగులోకి వచ్చిందని ఒక పోలీసు అధికారి తెలిపారు.
2021 మార్చ్ లో నిందితుడు బాలిక మీద అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. టోర్నమెంట్ లో ఆడించే నెపంతో అమ్మాయిని ఉదయ్ పూర్ తీసుకువెళ్లి అక్కడ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. అనేక సెక్షన్ల కింద అతనిమీద కేసు ఫైల్ చేసినట్టు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ హరేంద్ర మహావీర్ తెలిపారు.
అతనిమీద ఇతర ఇలాంటి కంప్లైంట్లు ఏమైనా వచ్చాయా? అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ మహావీర్.. ఇప్పటివరకైతే ఏమీ లేవు. కానీ ఇలాంటివి జరిగి ఉండే అవకాశం ఉన్నందును ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఈ విషయాన్ని కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశాం. అతన్ని నమ్మి కోచింగ్ కోసం పంపుతున్న తల్లిదండ్రుల నమ్మకాన్ని అతను వమ్ము చేశాడు. ఇలాంటి కొంతమంది వల్ల ఎంతోమంది క్రీడలకు దూరమవుతారు’ అని అన్నారు.
మంగళవారం ఉదయమే అతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నా.. ఆ తరువాతే అరెస్ట్ చేశామని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజయ్ పాల్ లాంబా తెలిపారు. అయితే బాధితురాలి భద్రత దృష్ట్యా ఆమె ఐడెంటిటీని గోప్యంగా ఉంచారు.