అందరికీ ఇష్టమైన రాగిసంకటి వేడివేడిగా సిద్ధమయ్యింది. వారంతా హాయిగా అది తినేశారు. తిన్న కాసేపటికే తీవ్రమైన Diarrhea, vomitingsతో కుటుంబ సభ్యులు విలవిల లాడారు. బాలిక తండ్రి తిప్పా నాయక్ (45), తల్లి సుధా బాయి (40), నాయనమ్మ గుండి బాయి (80), చెల్లి రమ్య (15) నెత్తురు కక్కుతూ నేలకూలారు. ఆమె సోదరుడు రాహుల్ మాత్రం ఎలాగే ఈ ఘటనలో బయటపడ్డాడు.
చిత్రదుర్గం : ఆ బాలికలో మొగ్గ తొడిగిన ద్వేషం మొత్తం family membersని నిలువునా కూల్చేసింది. కళ్లెదుటే కన్నవారు, తోబుట్టువు విలవిలలాడుతూ మరణిస్తున్నా వాస్తవాల్ని దాచిన ఆమె... ఆ విషయాన్ని ఎన్నో రోజులు బైటికి పొక్కుండా దాచలేకపోయింది. చిన్నవారైన తమ్ముడు, చెల్లికి ఇస్తున్న ప్రాధాన్యం.. పెద్ద సంతానంగా తనకు ఈ తల్లిదండ్రులు ఎందుకు ఇవ్వరని ఉడుకుమోతుదనం ఉగ్రరూపం దాల్చింది.
ఆ రూపం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే.. జూలై 13 వ తేదీన జరిగిన ఓ ఘటన తెలుసుకోవాలి. ఆరోజు కర్ణాటక లోని, చిత్రదుర్గం జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలోని భరమసాగర ఠాణా సముద్ర గ్రామంలో తిప్పా నాయక్ ఇంట్లో రాత్రి భోజనానికి కుటుంబసభ్యులంతా కూర్చున్నారు.
వారి రోజువారీ ఆహారం రాగి సంగటి. ఆ రోజు కూడా అందరికీ ఇష్టమైన రాగిసంకటి వేడివేడిగా సిద్ధమయ్యింది. వారంతా హాయిగా అది తినేశారు. తిన్న కాసేపటికే తీవ్రమైన Diarrhea, vomitingsతో కుటుంబ సభ్యులు విలవిల లాడారు. బాలిక తండ్రి తిప్పా నాయక్ (45), తల్లి సుధా బాయి (40), నాయనమ్మ గుండి బాయి (80), చెల్లి రమ్య (15) నెత్తురు కక్కుతూ నేలకూలారు. ఆమె సోదరుడు రాహుల్ మాత్రం ఎలాగే ఈ ఘటనలో బయటపడ్డాడు. అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అతను ఇటీవల కోలుకున్నాడు. ఆ రోజు ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది.
ఆ రాత్రి వారు తిన్న ఆహారం నమూనాలను రసాయన పరీక్షలకు పంపించిన పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా ఈ రసాయన పరీక్షల వివరాలు అధికారుల చేతికి అందాయి. ఆహారంలో poison కలిపారని తేలింది.
Kerala Floods: ఒకే కుటుంబంలో ఆరుగురు బలి..!
దీని మీద ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ‘ ఇక్కడే మాకు Suspicion మొదలైంది. ఆ ఇంట్లో అందరూ ఆహారం తీసుకున్న.. ఆ girl (17) మాత్రం ఎందుకు తినలేదు అనే ప్రశ్న మమ్మల్ని తొలిచి వేసింది. బాలిక విషయంలో ఒత్తిడి లేకుండా క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించాం. ఆమె నడక భిన్నంగా ఉండడం, విపరీతంగా తత్తరపాటు పడుతుండడం గమనించాము. ఏదో తప్పు చేసిన భావన ఆమెలో కనిపించింది. దీంతో ఆమెను గట్టిగానే నిలదీశాం. భయపడి పోయిన ఆమె వాస్తవాలు కక్కేసింది. చేసిన తప్పు ఒప్పుకుంది’ అని చిత్రదుర్గం ఎస్పి రాధిక నాటిక తన వెనుక ఉన్న వ్యక్తి వివరాలను సోమవారం వెల్లడించారు.
‘ నిజమే.. నేనే ఆ పని చేశా. వారిని murder చేశా. ఆ ఇంట్లో నేను పెద్దదాన్ని. నాకన్నా ఇద్దరు చిన్న వారు ఉన్నా వారికి ఏ పని చెప్పారు. అన్నింట్లోనూ వారికే ప్రాధాన్యం. నన్ను మాత్రం కూలిపనులకు పంపడం అన్యాయం కాదా? పెద్దల ప్రేమ నాకు దూరం అవుతుందనే బాధ కలిగింది. అందుకే రాగి సంకటి తయారు చేసే సమయంలోనే విషయం కలిపాను. వారి Love, affection నాకు అప్పుడు వారు నాకెందుకు అని బాధ వెంటాడింది’ అంటూ ఆ బాలిక తప్పు ఒప్పుకున్నట్లు ఎస్పీ వివరించారు. సోమవారం ఆ బాలికను ప్రభుత్వ సంరక్షణ శాల తరలించామని చెప్పారు
