బెడ్ పై నుంచి కిందపడ్డ 160 కిలోల మహిళ.. విపత్తు నిర్వహణ సిబ్బందికి కుటుంబం కాల్

మహారాష్ట్రకు చెందిన 160 కిలోల మహిళ బెడ్ పై నుంచి కిందపడిపోయింది. ఆమెను తిరిగి బెడ్ పైకి చేర్చడానికి నానా ప్రయాస పడ్డారు కుటుంబ సభ్యులు, కానీ సాధ్యపడలేదు. దీంతో ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు కాల్ చేశారు.
 

160 kg thane woman falls from bed family member calls for disaster management for help kms

ముంబయి: మహారాష్ట్రలో ఓ అసాధారణ ఘటన చోటుచేసుకుంది. థానే నగరంలో గురువారం 160 కిలోల మహిళ బెడ్ పై నుంచి కింద పడిపోయింది. ఆమెను మళ్లీ బెడ్ పైకి చేర్చడానికి కుటుంబ సభ్యులు శాయశక్తులా ప్రయత్నించారు. కానీ, అది వారికి సాధ్యం కాలేదు. దీంతో వారు వెంటనే విపత్తు నిర్వహణ సిబ్బందికి కాల్ చేశారు.

థానేలో వాగ్బిల్ ఏరియాలో ఓ ఫ్లాట్‌లో 62 ఏళ్ల మహిళకు చెందిన కుటుంబం నివసిస్తున్నది. ఆమె కొన్ని కదలలేని కొన్ని సమస్యల కారణంగా బెడ్ పైనే ఉంటున్నది. అయితే.. గురువారం ఆమె ప్రమాదవశాత్తు బెడ్ పై నుంచి కిందపడిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే పరుగున ఆమె వద్దకు చేరారు. ఆమెను తిరిగి బెడ్ పైకి చేర్చడానికి నానా ప్రయత్నాలు చేశారు. కానీ, వారి ప్రయాస వృథాగానే మిగిలిపోయింది.

దీంతో ఆమె కుటుంబానికి చెందిన ఓ సభ్యుడు ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు కాల్ చేశాడు. తమ ఇంట్లో 160 కిలోల బరువు ఉన్న మహిళ బెడ్ పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయిందని, ఆమెను తిరిగి పైకి చేర్చలేకపోతున్నామని చెప్పాడు. ఆమెను తిరిగి బెడ్ పైకి చేర్చడానికి సహకరించాలని విన్నవించాడు.

Also Read: భార్యకు జాబిల్లిని గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. చంద్రుడిపై ఎకరం కొన్నట్టు వెల్లడి.. అసలేం జరిగింది?

ఆ విజ్ఞప్తిని ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది ఆలకించారు. ఈ కాల్ వెంటనే రీజినల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెట్ (ఆర్‌డీఎంసీ) టీమ్ కాలర్ చెప్పిన అడ్రెస్‌కు వెళ్లినట్టు థానే మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ చీఫ్ యాసిన్ తాడ్వి చెప్పారు. ఆ మహిళను లేపి తిరిగి బెడ్ పైకి చేర్చినట్టు వివరించారు. బెడ్ పై నుంచి కిందపడినా ఆ మహిళకు గాయాలేమీ కలుగలేవని పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios