11వ తరగతి బాలిక ఆత్మహత్య చేసుకుంది. తన సూసైడ్ నోట్‌లో ఆత్మహత్యకు ఏకైక కారణం తన తండ్రే అని వివరించింది. అంతేకాదు, మరణించిన తర్వాత తన ఆత్మ శాంతించదని, ప్రతీకారం తీర్చుకుంటుందని తెలిపింది. 

రాజ్‌కోట్: ‘ఐ హేట్ యూ డాడీ, నా చావుకు ఒకే ఒక కారణం ఉన్నది. అది నువ్వే నాన్న. నువ్వెప్పుడూ నన్ను ఒక కూతురిలా ట్రీట్ చేయలేదు. నీకు తెలిసిందల్లా ఒక్కటే.. నన్ను తిట్టడం, ఆర్డర్ చేయడం.’ ఇవి ఓ 11వ తరగతి బాలిక చివరి వ్యాఖ్యలు. శనివారం రాత్రి ఆమె మరణానికి ముందు రాసిన సూసైడ్ నోట్. 16 ఏళ్ల ఆ బాలిక ఉన్న గర్ల్స్ హాస్టల్‌లో నుంచి ఆ నోట్ బుక్‌ను పోలీసులు రికవరీ చేసుకున్నారు.

గుజరాత్‌లోని పోర్బందర్‌లో కుతియానాకు చెందిన దివ్య రమేశ్ దోడియా 11వ తరగతి చదువుతున్నది. రాజ్‌కోట్‌లో ధొరాజీ టౌన్‌లో చదువుకుంటున్నది. రాయల్ స్కూల్‌లో చదువుకుంటున్నది. అదే హాస్టల్‌లో ఉంటున్నది. కానీ, శుక్రవారం రాత్రి ఆమె తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. 

ధొరాజీ పోలీసు స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ అనిరుద్ధ్ సిన్హ గోహిల్ ప్రకారం, తమకు ఈ సమాచారం తెలియగానే హాస్టల్ వెళ్లామని వివరించారు. బాడీని పోస్టుమార్టం కోసం పంపించారని తెలిపారు. హాస్టల్ వార్డెన్ సహా ఆ అమ్మాయి రూమ్ మేట్ల నుంచీ స్టేట్‌మెంట్లు రికార్డ్ చేశారు. 

శుక్రవారం తన ఒంట్లో నలతగా ఉన్నదని దివ్య రమేశ్ దోడియా తెలిపిందని, ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లామనీ హాస్టల్ వార్డెన్ వివరించారు. రాత్రి 7.30 గంటలకు పిల్లలంతా డిన్నర్ చేశారని, కామన్ హాల్‌లో గ్రూప్ స్టడీ కోసం అంతావెళ్లారని వివరించారు. శుక్రవారం ఆమె ఒంట్లో నలతగా ఉన్నదని తోటి విద్యార్థులతో తాను రానని చెప్పి హాస్టల్ రూమ్‌లోనే ఉండి చదువుకుంటానని తెలిపింది. పిల్లలు మళ్లీ రూమ్‌కు వెళ్లేసరికి సీలింగ్ ఫ్యాన్‌కు తగిలించిన ఉరి తాడుకు దివ్య వేలాడుతూ కనిపించింది. 

Also Read: ఆ ఏనుగులు మిస్సింగ్? ఆస్కార్ విన్నింగ్ డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్‌’లో కనిపించిన గజరాజులు మిస్సింగ్

గత మూడు రోజులుగా దివ్య ఆరోగ్యం బాగాలేదని తోటి విద్యార్థులు పోలీసులకు తెలిపారు. స్పాట్‌లో ఆధారాల కోసం వెతుకుతుండగా ఆమె ఓ నోట్‌బుక్‌లో రాసిన చివరి లైన్లను పోలీసులు రికవరీ చేసుకున్నారు. 

తన ఆత్మహత్యకు తండ్రే కారణం చెప్పిన ఆ బాలిక.. తన నానమ్మను గుర్తు చేసుకుంది. తాను బాధపడేది నానమ్మ కోసమే అని ఆ బాలిక ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన నోట్‌బుక్‌లో వివరించింది. తల్లి, తండ్రి ప్రేమను ఆమెనే తనకు పంచిందని పేర్కొంది. తన తల్లిని గుర్తు చేసుకుంటూ.. ‘అమ్మా నన్ను క్షమించు.. ఇంతటి టెన్షన్‌లో నేను బతకలేను. నా ఆత్మకు శాంతి లేదు. నేను కార్చిన ఒక్కో కన్నీటి బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాను’ అని ఆ బాలిక రాసుకుంది.