రాజస్థాన్లోని జోధ్పూర్ ఫలోడి జైలు నుంచి 16 మంది ఖైదీలు సోమవారం రాత్రి తప్పించుకున్నారు. సినీఫక్కీలో జైలు సిబ్బంది కళ్లలో కారం కొట్టి పరారయ్యారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర జైళ్ల శాఖ చర్యలకు ఉపక్రమించింది.

నిర్లక్ష్యం కారణంగా నలుగురు అధికారులతో పాటు ఓ కానిస్టేబుల్ ను మంగళవారం విధుల నుంచి సస్పెండ్ చేసింది. మరోవైపు ఈ ఘటనను తీవ్రమైన చర్యగా పేర్కొంటూ డిపార్ట్మెంట్ దీనికి బాధ్యత వహిస్తుందని తెలిపారు జైళ్ల శాఖ డీజీ రాజీవ్ దాసోత్ తెలిపారు.

పరారైన ఖైదీలను పట్టుకునేందుకు స్థానిక పోలీసులు, ఎస్పీతో సంప్రదింపులు జరిపి గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు. ఈ మేరకు జోద్పూర్, బికనేర్ సరిహద్దులను మూసి వేశామన్నారు,

కాగా తప్పించుకున్న ఖైదీలను జగదీశ్, సుఖ్ దేవ్, షోకత్ అలీ, అశోక్, 
ప్రేమ్, ప్రదీప్, రాజ్ కుమార్, మోహన్, శరవన్, ముఖేష్, శివ, అనిల్, శంకర్, ప్రతాప్, హనుమాన్, మహేంద్ర గా గుర్తించినట్లు తెలిపారు.