రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బోలెరా వాహనాన్ని బస్సు ఢీకొట్టిన ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. డందానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బలేసర్ మండలం జోధ్‌పూర్ వద్ద 125వ నెంబర్ జాతీయ రహదారిపై బోలెరో కారును బస్సు ఢీకొట్టింది.

ఈ ఘటనలో 16 మంది అక్కడికక్కడే మరణించారు.  మరణించిన వారిలో ఐదుగురు స్త్రీలతో పాటు ఒక చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బలెసర్, జోధ్‌పూర్ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరిన్ని వివరాలు అందాల్సి వుంది.