Asianet News TeluguAsianet News Telugu

రోజురోజుకూ పెరుగుతున్న పదిహేనేళ్ల బాలిక పొట్ట.. అనుమానంతో తల్లిదండ్రులు నిలదీయగా....

పదిహేనేళ్ల బాలికపై ఎదురింటి వ్యక్తి  అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు. దీంతో ఆ బాలిక భయపడింది. కానీ ఆర్నెళ్ల తరువాత.. 
 

15years old girl raped and preganant by neibhour in uttarpradesh
Author
First Published Nov 28, 2022, 9:33 AM IST

ఉత్తర ప్రదేశ్ :

ఉత్తరప్రదేశ్ లో ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.  15 సంవత్సరాల బాలిక గర్భం దాల్చింది. ఆ విషయం తల్లిదండ్రులకు తెలియదు.  బాలిక ప్రవర్తనలో తేడా రావడం..  రోజు రోజుకు పెరుగుతుండటంతో  అనుమానం వచ్చింది. అలా ఎందుకు జరుగుతోందని  తల్లి  కూతురిని ప్రశ్నించింది.  అయితే, ఆమె మాత్రం ఇటీవలి కాలంలో ఎక్కువగా తింటున్నానని.. అందుకే పొట్ట వస్తుందని  చెప్పుకొచ్చింది.  ఈ సమాధానంతో తల్లిదండ్రులు తృప్తి పడలేదు. తండ్రి తీవ్ర కోపానికి వచ్చాడు.  వెంటనే ఆ బాలికను ఓ గదిలోకి తీసుకు వెళ్ళాడు.  అందుబాటులో ఉన్న సుత్తి తీసుకుని  బెదిరించాడు.  నిజం చెప్పకపోతే  దాంతో కొడతానని భయపెట్టాడు. దీంతో గజగజ వణికి పోయిన అమ్మాయి  అసలు విషయం  చెప్పింది. 

 ఎదురింట్లో ఉన్న అబ్బాయి.. కొద్దికాలం క్రితం  తన మీద  హత్య అత్యాచారానికి పాల్పడ్డాడని  చెప్పుకొచ్చింది. దీనితో షాక్ కు గురైన తల్లిదండ్రులు..  వెంటనే  పోలీస్ స్టేషన్కు వెళ్లారు.  ఎదురింటి యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు  పోలీసులు కేసు నమోదు  చేసుకున్నారు. నిందితుడిని  అదుపులోకి తీసుకున్నారు.  దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కు చెందిన  టీనేజీ బాలిక మీద  6 నెలల క్రితం అత్యాచారం జరిగింది.  ఆమె  పొరుగింట్లో  ఉండే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇది  ఈ  ఏడాది  మే నెలలో జరిగింది. ఆ సమయంలో బాలిక తన ఇంటి బయట  ఒంటరిగా కూర్చుంది.

అన్నంలో చీమలు ఉన్నాయని గొడవ.. భర్తను స్కార్ప్ తో గొంతు నులిమి చంపిన భార్య..

ఇది గమనించిన ఆ యువకుడు ఆమెను రమ్మని పిలిచాడు. ఆమె వెళ్లడానికి  ఒప్పుకోలేదు. రానని చెప్పింది. దీంతో అతడు  తగ్గించాడు..  ఆమె  నోరు నొక్కి..   బలవంతంగా దగ్గరలోని గుడిసెలోకి తీసుకువెళ్లాడు.  అక్కడ ఆమె మీద అత్యాచారం చేశాడు.  ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.  అత్యాచారంతో బెదిరిపోయిన బాలిక ఈ హెచ్చరికతో  తీవ్ర భయాందోళనలకు గురి అయ్యింది.  అందుకే విషయం ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది.

ఆ రోజు జరిగిన అత్యాచారం వల్ల భార్య గర్భం దాల్చింది. ఈ కారణంగా రోజురోజుకు  కడుపు పెరుగుతూ వచ్చింది.  దీంతో తల్లిదండ్రులకు అనుమానం మొదలైంది.  అందుకే ఆమెను నిలదీశారు.  అయితే,  చంపేస్తానని బెదిరించి విషయం గుర్తుకువచ్చి  తల్లిదండ్రులకు అమ్మాయి నిజం చెప్పలేదు. ఏదో సాకు చెప్పి తప్పించుకోవాలనే ప్రయత్నించింది. అయితే,  తండ్రి మాత్రం కూతురు గర్భవతేమోనని అనుమానం వచ్చింది.  అందుకే గట్టిగా నిలదీశాడు. భయపడిన బాలిక అసలు విషయం చెప్పేసింది. దీంతో తల్లిదండ్రులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని  అరెస్టు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios