Asianet News TeluguAsianet News Telugu

సోదరిని అసభ్యంగా చూస్తున్నాడని.. 16యేళ్ల స్నేహితుడిని చంపిన, 15యేళ్ల బాలుడు...

సోదరిని అసభ్యంగా చూశాడని తన బెస్ట్ ఫ్రెండ్ ను హత్య చేశాడో మైనర్ బాలుడు. మద్యం తాగించి స్నేహితుడి గొంతు కోసి చంపాడు. 

15years old Boy, kills 16 years old friend, for 'ogling' sister in Bijnor
Author
First Published Oct 1, 2022, 12:24 PM IST

బిజ్నోర్ : తన బెస్ట్ ఫ్రెండ్ తన సోదరిని అసభ్యంగా చూస్తున్నాడనే అనుమానంతో.. ఓ 15 యేళ్ల బాలుడు.. 16యేళ్ల బాలుడిని హత్య చేశాడు. గురువారం సాయంత్రం బిజ్నోర్ లో ఈ ఘటన జరిగింది. బిజ్నోర్‌లోని ధాంపూర్ పట్టణంలోని ఓ తోటలో బాలుడి మృతదేహం లభ్యమైంది. నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ధాంపూర్ సర్కిల్ ఆఫీసర్ (సిఓ) ఇందు సిద్ధార్థ్ తెలిపారు. నిందితుడి స్కూల్ బ్యాగ్ నుంచి బాధితుడి మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరు నగీనాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. ఈ విషయం వివిధ వర్గాలకు సంబంధించినది కాబట్టి, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ ప్రాంతంలో భారీ పోలీసు బలగాలను మోహరించినట్లు పోలీసులు తెలిపారు.

దారితప్పి వచ్చిన బాలిక కిడ్నాప్, సామూహిక అత్యాచారం.. రూ.50వేలకు అమ్మేసి.. దారుణం...

మృతుడు తరచూ తన ఇంటికి వెళ్లి తన సోదరిని చూసేవాడని, అందుకే స్నేహితుడిని అంతమొందించేందుకు పథకం పన్నాడని నిందితుడు పోలీసులకు తెలిపాడని, నిందితులు గురువారం సాయంత్రం తన బైక్‌పై మామిడి తోటలోకి తీసుకెళ్లారని సిఓ తెలిపారు. అక్కడ ఇద్దరూ మద్యం సేవించారు. ఆపై అతను తన స్నేహితుడిని గొంతు కోసి చంపాడు" అని చెప్పుకొచ్చారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios