న్యూఢిల్లీ: దేశంలోని 150 జిల్లాల్లో  కరోనా కేసులు విపరీతంగా ఉన్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధించాలని కేంద్రం సిఫారసు చేసింది. మంగళవారం నాడు  కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం 150 జిల్లాల్లో లాక్‌డౌన్ విధించాలని ఆయా రాష్ట్రాలకు సిఫారసు చేసింది. ఈ 150 జిల్లాల్లో కరోనా పాజిటీవీ రేటు 15 శాతం ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ  తెలిపింది. ఈ జిల్లాల్లో లాక్‌డౌన్ లపై  ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై  కేంద్రం సంప్రదింపులు చేసే అవకాశం ఉంది. 

 

రానున్న రోజుల్లో  కరోనా  వైరస్  చైన్ ను బ్రేక్ చేయడం కోసం  కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాల్సిన అవసరం ఉందని  వైద్య ఆరోగ్య శాఖాధికారులు అభిప్రాయపడ్డారు. వారం రోజుల్లో 10 శాతానికి పైగా కేసులు నమోదైన  జిల్లాల్లో కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు.గత ఏడు రోజులుగా దేశంలో మూడు లక్షలకు పైగా కరోనా కేసులు రికార్డు అవుతున్నాయి.  అంతేకాదు  కరోనాతో మరణించిన వారి సంఖ్య రెండు నుండి మూడు వేల మధ్య రికార్డు అవుతున్నాయి.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona