మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లాలో 15యేళ్ల బాలికమీద ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. ఈ తతంగాన్నంతా నిందితులు వీడియో రికార్డు చేశారు. ఈ మేరకు పోలీసులు బుధవారం వెల్లడించారు.
మధ్యప్రదేశ్ : రోజురోజుకూ మహిళలు, బాలికల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు వారిమీద లైంగిక దాడులతో పెట్రోగి పోతున్నారు. ముఖ్యంగా బాలికల మీద సామూహిక అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి దారుణ ఘటనే మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లాలో 15యేళ్ల బాలికమీద ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. ఈ తతంగాన్నంతా నిందితులు వీడియో రికార్డు చేశారు. ఈ మేరకు పోలీసులు బుధవారం వెల్లడించారు. తన సోదరికి సాయం చేసేందుకు 10వ తరగతి చదువుతున్న బాధితురాలు గుంగాకు వెళ్లింది.
ఆమె సోదరి ఆస్పత్రిలో ఉండగా, బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే సమయంలో తమ బంధువు ఉన్నాడా అంటూ ఓ వ్యక్తి ఇంట్లో ప్రవేశించాడు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న నిందితుడు మరో ఇద్దరితో కలిసి బాలిక మీద బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీంతోపాటు ఈ నిర్వాకాన్ని నిందితులు ముగ్గురూ వీడియో కూడా తీశారు. బాలిక తిరిగి తన ఇంటికి వచ్చాక తండ్రికి ఈ విషయం చెప్పింది. వెంటనే వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
