ఓ పదిహేనేళ్ల మైనర్ బాలికపై పక్కింట్లో వుండే ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిని దారుణం ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. బాలికను నమ్మించి తమవెంట తీసుకెళ్లిన యువకులు ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా  చెబితే చంపేస్తామని బెదిరించినా...బాలిక దైర్యంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో నిందితులిద్దరు కటకటాలపాలయ్యారు. 

ఈ అఘాయిత్యానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ ఘజియా బాద్ జిల్లా సహిబాబాద్ లో ఓ 15ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి నివాసముంటోంది. స్థానికంగా  ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.అయితే ఈ  బాలికపై పక్కింట్లో వుండే ఇద్దరు యువకులు కన్నేశారు. ఇలా వక్రబుద్దితోనే ఆమెతో పరిచయం పెంచుకున్నారు. 

అయితే సోమవారం సరుకుల కోసం బయటకు వెళ్లి ఇంటికి వస్తున్న బాలికను ఈ  ఇద్దరు యువకులు తారసపడ్డారు. మీ తమ్ముడికి యాక్సిడెంట్ జరిగింది...మీ అమ్మా నాన్న నిన్ను తీసుకురమ్మని మమ్మల్ని పంపించారని చెప్పి నమ్మించి బాలికను తమ బైక్ పై ఎక్కించుకున్నారు. అక్కడి నుండి ఆమెను నేరుగా ఓ పార్కులోకి తీసుకెళ్లి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి బాలికను ఇంటిదగ్గర వదిలేశారు. 

అయితే తనపై జరిగిన అఘాయిత్యం గురించి బాలిక తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.