Asianet News TeluguAsianet News Telugu

చైన్ స్నాచర్ ను వెంటాడి పట్టుకొన్న 15 ఏళ్ల బాలిక: సోషల్ మీడియాలో వైరల్

తన ఫోన్ తో పాటు బంగారు చైన్ లాక్కెళ్తున్న దొంగను ఎదిరించి 15 ఏళ్ల బాలిక పట్టుకొంది. ఈ బాలిక సాహసాన్ని పలువురు ప్రశంసల్లో ముంచెత్తారు. బాధితురాలికి సిటీ డిప్యూటీ కమిషనర్ ఘన్‌శ్యామ్ తోరి రూ. 51 వేలను నజరానాను ప్రకటించారు.

15-Year-Old Jalandhar Girl Fights Two Mobile Snatchers on Bike in This Viral Video
Author
Punjab, First Published Sep 2, 2020, 1:59 PM IST

ఛండీఘడ్: తన ఫోన్ తో పాటు బంగారు చైన్ లాక్కెళ్తున్న దొంగను ఎదిరించి 15 ఏళ్ల బాలిక పట్టుకొంది. ఈ బాలిక సాహసాన్ని పలువురు ప్రశంసల్లో ముంచెత్తారు. బాధితురాలికి సిటీ డిప్యూటీ కమిషనర్ ఘన్‌శ్యామ్ తోరి రూ. 51 వేలను నజరానాను ప్రకటించారు.

పంజాబ్ రాష్ట్రంలోని ఫతేపూర్ మొహల్లాలో  15 ఏళ్ల కుసుమ కుమారి తన ఇంటికి నడుచుకొంటూ వెళ్తోంది. ఈ సమయంలో బైక్ పై ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఆమె చేతిలోని ఫోన్ ను బంగారు  చైన్ ను లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు.

దీంతో కుసుమకుమారి వెంటనే అప్రమత్తమైంది. ఆ బైక్ వెంట పరిగెత్తింది. బైక్ వెనుక కూర్చొన్న వ్యక్తి టీ షర్ట్ పట్టుకొని లాగింది. దీంతో  ఆ వ్యక్తి బైక్ మీద నుండి కిందపడ్డాడు. అదే సమయంలో పదునైన ఆయుధంతో ఆమె బైక్ పై కూర్చొన్న యువకుడిపై దాడికి దిగింది.

ఇదే సమయంలో ఈ ఘర్షణ సందర్భంగా అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొన్నారు. బైక్ పై ఓ వ్యక్తి పారిపోయాడు. మరో వ్యక్తిని స్థానికులు పట్టుకొన్నారు. సెల్ ఫోన్, చైన్ కుసుకుమారి దక్కించుకొంది.

స్థానికులు దొంగకు బడిత పూజ చేశారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి.నిందితులనను అవినాష్ కుమార్, అలియాస్ అషు, వినోద్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. 

ఈ ఘటన ఆగష్టు 30వ తేదీన చోటు చేసుకొంది. ఈ దాడిలో గాయపడిన కుసుమ కుమారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. సాహస బాలికకు జోషి ఆసుపత్రి ఉచితంగా చికిత్స అందించింది.బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి కుసుమ కుమారి ఫొటోను వాడుకొంటామని అధికారులు ప్రకటించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios