కోట: రాజస్థాన్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. స్కూల్ బ్యాగ్ కొనిస్తామని తీసుకుని వెళ్లి ఆమె స్నేహితులు దారుణానికి ఒడిగట్టారు. ఆమెపై 8 రోజుల పాటు అత్యాచారం చేశారు. 9 మంది ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ సంఘటన రాజస్థాన్ లోని ఝలావర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. 

పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఝలావర్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను ఫిబ్రవరి 25వ తేదీన ఆమె స్నేహితులు బ్యాగ్ కొనడానికని చెప్పి నగరానికి దూరంగా ఉన్న నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లారు. 

అక్కడ వారితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు బాలికకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారు. ఆ తర్వాత అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఎనిమిది రోజుల పాటు బాలికను వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ అత్యాచారం చేశారు. ఎనిమిది రోజుల తర్వాత శుక్రవారం బాలిక ఇంటికి చేరుకుంది.

తనపై 9 మంది అత్యాచారం చేసినట్లు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు.