పాట్నా: బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పదిహేనేళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై ఓ దుండగుడు అత్యాచారం చేశాడు. నిందితుడిని సంతోష్ కుమార్ గా గుర్తించారు. బాలిక ఏడో తరగతి చదువుతోంది. 

ఆ సంఘటన పాట్నాలోని పత్రకార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ాఝీ పార్క్ సమీపంలో జరిగింది. నిందితుడు కూరగాయలు అమ్ముతూ ఉంటాడు. హనుమాన్ నగర్ లోని తన ఇంట్లో ఉన్న నిందితుడిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు.

బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి వద్ద ఉన్న బాలికను సంతోష్ కుమార్ కిడ్నాప్ చేశాడని పత్రకార్ నగర్ పోలీసు స్టేషన్ అధికారి ప్రమోద్ కుమార్ చెప్పారు. 

బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన బాలిక తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.