Asianet News TeluguAsianet News Telugu

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..  ముగ్గురు మైనర్లు సహా ఆరుగురి అరెస్టు

ముంబైలో దారుణం జరిగింది. మయ మాటలు చెప్పి 15 ఏళ్ల బాలికపై సాముహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.నిందితులు మైనర్ బాలికకు తెలుసునని, వన్ ప్లస్ వన్ నిర్మాణంలోని మెజ్జనైన్ అంతస్తులో అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు

15-Year-Old Girl Gangraped In Mumbai, 6 Arrested: Cops
Author
First Published Dec 24, 2022, 11:05 PM IST

దేశంలో మహిళలు,చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. రోజురోజుకు అత్యాచార, హత్య ఘటనలు పెరుగుతున్నాయి. కామాంధులు తమ కామావాంఛ తీర్చుకునేందుకు బాలికలు,మహిళపై దారుణాలకు పాల్పడుతున్నారు. వారి రక్షణ కోసం పోక్సో,నిర్భయ వంటి కఠిన చట్టాలు తీసుకుని వచ్చినా .. కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. వాస్తవానికి ఈ తరహా ఘటనలు కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి. చాలామంది పరువు పోతుందని బయటకు రాకుండా ఉన్న ఘటనలేన్నో.. 

తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో సమాజం సిగ్గుతో తల దించుకునే ఘటన దారుణమైన ఘటన చోటుచేసుకుంది.ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో 15 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ బాధాకరమైన గ్యాంగ్‌రేప్ కేసులో ముంబై పోలీసులు 6 మందిపై కేసు (ఎఫ్‌ఐఆర్) నమోదు చేశారు. షాకింగ్ విషయం ఏమిటంటే ఆరుగురు నిందితుల్లో ముగ్గురు నిందితులు మైనర్లే. నిందితులందరిని  పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు మైనర్ నిందితులను ముంబై పోలీసులు డోంగ్రీ ప్రాంతంలో ఉన్న చిల్డ్రన్స్ చైల్డ్ రిఫార్మ్ హోమ్‌కు తరలించారు. ఈ ఘటనపై ముంబై పోలీసుల విచారణ కొనసాగుతోంది.

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో, ముంబై పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 376 (DA) (2) (N), 114 , 34 సెక్షన్లు తో పాటు POCSO చట్టంలోని పలు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముంబయి పోలీసు సీనియర్‌ అధికారులు సునీల్‌ చంద్రమోర్‌, ఎన్‌ఎం జోషి మాట్లాడుతూ ముగ్గురు బాల నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. కోర్టు ముగ్గురిని డిసెంబర్ 30 వరకు పోలీసు కస్టడీకి పంపింది.

అసలు విషయం ఏమిటి?

మైనర్ నిందితుల్లో ఒకరు బాధితురాలికి మంచి స్నేహితుడు.  డిసెంబరు 23న  నిందితుడు మయ మాటలు చెప్పి.. బాధితురాలిని నూతన నిర్మాణమవుతున్న భవనంలోకి తీసుకెళ్లి.. ఆమె స్నేహితుడితో పాటు నిందితులందరూ అత్యాచారానికి పాల్పడ్డారు. మైనర్‌పై జరిగిన అత్యాచారం కేసును ముంబై పోలీసులు విచారిస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా కృషి చేస్తామని ముంబై పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios