Asianet News TeluguAsianet News Telugu

పదిహేనేళ్లకే ప్రేమ, గర్భం.. పుట్టిన శిశువును ఏం చేయాలో తెలీక.. గొంతుకు తాడు బిగించి..

సాగర్ జిల్లాలోని డహోహ్ ప్రాంతానికి చెందిన 15 యేళ్ల బాలిక అదే ప్రాంతానికి చెందిన 17 యేళ్ల బాలుడితో లవ్ లో పడింది. ఇద్దరికీ మైనార్టీ తీరలేదు. ఏ యేడాది జనవరిలో ఇద్దరూ శారీరకంగా దగ్గర కావడంతో ఆ బాలిక గర్భం దాల్చింది. త నెల 16వ తేదీన బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 22 రోజులు హాస్పిటల్ లో ఉన్న తరువాత ఇంటికి వెళ్లింది. 

15 year old girl came to hospital with dead child in madhya pradesh
Author
Hyderabad, First Published Nov 25, 2021, 3:56 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మధ్యప్రదేశ్ : రోజుల వయసున్న పసికందును తీసుకుని ఓ girl ఆస్పత్రికి వెళ్లింది. ఆ పసికందుకు తానే తల్లినని చెప్పింది. ఆరోగ్యం బాగోలేదని, చికిత్స చేయమని అడిగింది. అప్పటికే ఆ new born baby మరణించింది. ఆ బాలిక ప్రవర్తన చూసి డాక్టర్లకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఆ బాలిక తనకు పుట్టిన బిడ్డను తనే చంపుకుందని తేలింది. madhyapradesh లోని సాగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 

సాగర్ జిల్లాలోని డహోహ్ ప్రాంతానికి చెందిన 15 యేళ్ల బాలిక అదే ప్రాంతానికి చెందిన 17 యేళ్ల బాలుడితో loveలో పడింది. ఇద్దరికీ మైనార్టీ తీరలేదు. ఏ యేడాది జనవరిలో ఇద్దరూ శారీరకంగా దగ్గర కావడంతో ఆ బాలిక pregnant అయ్యింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బాలుడి మీద అత్యాచారం కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అరెస్ట్ చేసి జువెనైన్ హోమ్ కు తరలించారు. గత నెల 16వ తేదీన బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 22 రోజులు హాస్పిటల్ లో ఉన్న తరువాత ఇంటికి వెళ్లింది. 

ఈ నెల 10వ తేదీ రాత్రి తన బిడ్డను తీసుకుని ఆ బాలిక స్థానిక పీహెచ్ సీకి వెళ్లింది. అప్పటికే ఆ పసికందు మరణించింది. వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో ఆ బాలిక తన తప్పును అంగీకరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను బాలికల జువెనల్ హోంకు తరలించారు. 

ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం.. నలుగురు అరెస్ట్...

ఇదిలా ఉండగా, మంగళూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టైల్స్ ఫ్యాక్టరీలో ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో పోలీసులు మంగళవారం సాయంత్రం నలుగురు కూలీలను అరెస్టు చేశారు. చిన్నారిపై లైంగిక దాడి, హత్య ఆరోపణలపై నిందితుల కోసం  40 మంది పోలీసులు.. నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపులు చేపట్టారు. 

ఈ నిందితుల్లో ముగ్గురు - జైబన్ అకా జే సింగ్ (21), ముఖేష్ సింగ్, (20), మధ్యప్రదేశ్ కు చెందినవారు కాగా, మనీష్ తిర్కి (33) జార్ఖండ్‌కు చెందినవాడు. వీరు ముగ్గురూ అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వీరితో పాటు నాలుగో నిందితుడు madhyapradeshకి చెందిన మునీమ్ సింగ్ (20), పుత్తూరులో కూలీగా పనిచేస్తున్నాడు. జార్ఖండ్‌కు చెందిన girl child తల్లిదండ్రులు కూడా గత రెండేళ్లుగా అదే ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారని పోలీసు చీఫ్ ఎన్ శశికుమార్ బుధవారం తెలిపారు.

ఆదివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో Factory premisesలోని వాటర్ ట్యాంక్ దగ్గర బాలిక తన ముగ్గురు తోబుట్టువులతో ఆడుకుంటుంది. ఆ తరువాత కనిపించకుండా పోయిందని పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల విచారణలో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారిని తీసుకువెళ్లేప్పుడు అరవకుండా నోటిని గట్టిగా మూసి లాక్కెళ్లారని తేలింది. ఆ తరువాత ఆ చిన్నారిపై నలుగురు అత్యంత పాశవికంగా ఒకరి తరువాత ఒకరు వంతులవారీగా Sexual harassmentకు పాల్పడ్డారు.

దానికి ఆ బాలిక తట్టుకోలేక, తీవ్ర రక్తస్రావం కావడం,  నొప్పిని తట్టుకోలేక కేకలు వేయడం ప్రారంభించడంతో, నిందితులు సంఘటన వెలుగులోకి వస్తుందని భయపడ్డారు. దీంతో అరవద్దని జైబన్ ఆమెను గట్టిగా తోసేశాడు. అప్పటికీ చిన్నారి శబ్దాలు ఆపకపోవడంతో... ఆ తరువాత అతను, మునీమ్ కలిసి ఆమెను రెండు అడుగుల లోతైన drainలో పడవేసారు.

Follow Us:
Download App:
  • android
  • ios