Asianet News TeluguAsianet News Telugu

దారుణం : దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచారం, చూపు కోల్పోయిన బాలిక...

మైనరైన దివ్యాంగురాలిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన బీహార్ లో కలకలం రేపుతోంది. మూగ చెవిటి అయిన 15 ఏళ్ల బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

15-year-old disabled girl raped in Bihar, eyes damaged; 3 held  - bsb
Author
Hyderabad, First Published Jan 13, 2021, 3:28 PM IST

మైనరైన దివ్యాంగురాలిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన బీహార్ లో కలకలం రేపుతోంది. మూగ చెవిటి అయిన 15 ఏళ్ల బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఆమెను తీవ్రంగా గాయపర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. బిహార్‌లోని మధుబాన్‌ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. మధుబాన్‌ జిల్లా ఎస్పీ సత్యప్రకాశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హర్లకి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కౌవహ బర్హి గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన (చెవిటి, మూగ) బాలిక (15) తన స్నేహితులతో కలిసి మేకల్ని కాయడానికి అటవీ ప్రాంతానికి వెళ్లింది. 

ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు ఆమె వెంట పడ్డారు. ఆమె తిరస్కరిస్తుండడంతో బాలికను లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇది గమనిస్తున్న తోటి బాలికలు వెంటనే ఈ విషయాన్ని బాధితురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. 

కుటుంబసభ్యులు వెళ్లి చూసేసరికి ఆ బాలిక తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉంది. మరీ దారుణమైన విషయం ఏంటంటే దుండగుల దాడిలో ఆ బాలిక కంటిచూపు కోల్పోయింది. బాధితురాలిని మధుబానీలోని సదర్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

ఈ పాశవిక దాడి ఘటనపై బిహార్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఘటనను ఖండిస్తున్నాయి. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios