Asianet News TeluguAsianet News Telugu

Bengaluruలో 15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు: భయాందోళనలో పేరేంట్స్


కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో 15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో  పేరేంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై పోలీసులు రంగంలోకి దిగారు.

 15 schools in Bengaluru receive bomb threats through e-mail lns
Author
First Published Dec 1, 2023, 10:02 AM IST


బెంగుళూరు: నగరంలోని  15 స్కూళ్లకు  బాంబు బెదిరింపులు వచ్చాయి.  దీంతో  ఈ స్కూల్లో చదివే విద్యార్థుల పేరేంట్స్ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.  ఈ మెయిల్ ద్వారా  గుర్తు తెలియని వ్యక్తి బాంబు బెదిరింపులకు పాల్పడ్డాడు. నగరంలోని  బసవేశ్వర్ నగర్ నాఫెల్ స్కూల్ తో నగరంలోని పలు స్కూళ్లకు  బాంబు బెదిరింపులు వచ్చాయి. 


 యెలహంకలో ఉన్న స్కూల్ కు బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది.  దీంతో  ఈ స్కూల్ లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్ నుండి తమ పిల్లలను ఇళ్లకు తీసుకు వచ్చేందుకు  ఇంటి నుండి స్కూళ్లకు బయలు దేరారు. నగరంలోని పలు స్కూళ్లకు  బాంబు బెదిరింపు వచ్చినట్టుగా తమ దృష్టికి వచ్చిందని బెంగుళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ చెప్పారు.

బెదిరింపు వచ్చిన అన్ని స్కూళ్లలో బాంబు స్క్వాడ్ తనిఖీలు ప్రారంభించిందని ఆయన  చెప్పారు. బసవేశ్వర నగర్ పోలీసులు  బాంబు బెదిరింపు వచ్చిన స్కూళ్లో  బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. గతంలో కూడ ఇదే తరహా  బెదిరింపు కాల్స్ వచ్చిన విషయాన్ని  స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.  బెదిరింపు ఈ మెయిల్ లో  ఒక్క స్కూల్ తో పాటు  పలు స్కూళ్ల పేర్లున్నాయి. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios