Asianet News TeluguAsianet News Telugu

ఆక్సీజన్ కొరత.. గోవా ఆస్పత్రిలో మరో 15 మంది మృతి...

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. మరోవైపు కరోనా చికిత్సలో ఆక్సీజన్ అందక చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆక్సీజన్ సరఫరాలో లోటు లేకుండా చూసుకోవాలని.. కోర్టు ఎన్నిసార్లు ప్రభుత్వాలకు మొట్టికాయలు వేసినా ఈ ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి.

15 more covid 19 patients die in goa gmch hospital - bsb
Author
Hyderabad, First Published May 14, 2021, 9:33 AM IST

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. మరోవైపు కరోనా చికిత్సలో ఆక్సీజన్ అందక చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆక్సీజన్ సరఫరాలో లోటు లేకుండా చూసుకోవాలని.. కోర్టు ఎన్నిసార్లు ప్రభుత్వాలకు మొట్టికాయలు వేసినా ఈ ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి.

తాజగా  గోవా మెడికల్ కళాశాల ఆసుపత్రి జీఎంసీహెచ్‌లో ఆక్సిజన్ అందక గురువారం మరో 15 మంది బాధితులు మృత్యువాత పడ్డారు. ఒక పెద్ద ఆక్సిజన్ సిలిండర్ కు అనేక చిన్న సిలిండర్లను కలపడం వల్ల.. తలెత్తిన లోపాల వల్లే వీరిలో కొందరు చనిపోయారని భావిస్తున్నామని రాష్ట్ర అధికారులు బాంబే హైకోర్టు గోవా ధర్మాసనానికి తెలిపారు.

అర్ధరాత్రి రెండు గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య వీరు తుదిశ్వాస విడిచారని తెలిపారు. చికిత్స పొందే కోవిడ్ బాధితులకు అవసరమైన ఆక్సిజన్ ను సక్రమంగా అందించాలని తాము ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి విషాదం చోటు చేసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

మూడు రోజుల క్రితం  మే 12న ఇదే ఆస్పత్రిలో 26 మంది మృతి చెందడంపై దాఖలైన పిటిషన్ ను గురువారం విచారించింది. ఈ సందర్భంగా తాజా ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరాను అందుబాటులో ఉంచాలని జస్టిస్ నితిన్‌ సాంబ్రే, జస్టిస్‌ ఎంఎస్‌ సోనక్‌ల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
 
Follow Us:
Download App:
  • android
  • ios