ముంబై: మహారాష్ట్రలోని ఔరంగాబాదులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది వలస కూలీల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు జల్నా, ఔరంగాబాద్ మధ్య ఈ ప్రమాదం సంభవించింది. 

లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలు రైలు పట్టాలపై రాత్రి నిద్రించారు. వారిలో పిల్లలు కూడా  ఉన్నారు. వారిపై నుంచి రైలు వెళ్లింది. వారిపై గూడ్స్ రైలు వెళ్లింది. దాంతో ఆ ప్రమాదం జరిగింది. శవాలు సంఘటనా చెల్లాచెదురుగా పడిపోయాయి.

కర్మాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. రైల్వై పోలీసు బలగాలు, పోలీసులు బలగాలు సంఘటనా స్థలానికి బయలుదేరాయి. రైళ్లు రావడం లేదనే ఉద్దేశంంతో వలస కూలీలు రైల్వే ట్రాక్ మీద నిద్రించారు.