హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడి ఘటనలో 15 మంది దుర్మరణం పాలయ్యారు. కులూ జిల్లాలోని బంజర్ నుంచి గదగుశానికి వెళుతున్న బస్సు బంజర సమీపంలో అదుపుతప్పి లోయలోకి పడిపోయింది.

సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 15 మృతదేహాలను వెలికితీయగా.. 30 మంది తీవ్రగాయాల పాలయ్యారు. వీరిని సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.