మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మినీ బస్సుని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 15మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవాలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులోని ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులంతా రెండు వాహనాల మధ్యలో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయారు.

అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.