హ్యాకింగ్ బారిన పడిన బ్యాంక్.. 94కోట్లు స్వాహా

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 14, Aug 2018, 2:50 PM IST
15, 000 transactions in 7 hrs: Cosmos Bank's server hacked, Rs 94 cr moved to Hong Kong
Highlights

భారత్, హాంకాంగ్‌ దేశాల్లోని పలు ఖాతాలకు వాటిని మళ్లించారు. తొలుత ఈ నెల 11 సర్వర్‌ను హ్యాక్ చేసి వివిధ ట్రాన్సాక్షన్లలో రూ.78 కోట్ల మేర దేశం వెలుపలికి తరలించారు.

హ్యాకర్లు రోజు రోజుకీ రెచ్చిపోతున్నారు. హ్యాకర్ల కారణంగా ఓ బ్యాంక్ ఖజానాకి రూ.94కోట్లు గండి పడిన సంఘటన మహారాష్ట్ర రాజధాని పూణెలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...పూణేలోని కాస్మోస్ బ్యాంకు మెయిన్ బ్రాంచి సర్వర్‌‌ను చెరబట్టి రూ. 94.42 కోట్లు స్వాహా చేశారు. భారత్, హాంకాంగ్‌ దేశాల్లోని పలు ఖాతాలకు వాటిని మళ్లించారు. తొలుత ఈ నెల 11 సర్వర్‌ను హ్యాక్ చేసి వివిధ ట్రాన్సాక్షన్లలో రూ.78 కోట్ల మేర దేశం వెలుపలికి తరలించారు.
 
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీ), వీసాల ద్వారా కూడా భారత్‌లోని ఓ ఖాతాకు రూ.2.5 కోట్లు తరలించడం గమనార్హం. ఈ నెల 13న ఇదే బ్యాంకు సర్వర్ మరోసారి హ్యాకింగ్‌కు గురైంది. ఈసారి హాంకాంగ్‌లో ఏఎల్ఎమ్ ట్రేడింగ్ కంపెనీ ఖాతాలోకి స్విఫ్ట్ లావాదేవీల ద్వారా రూ.14 కోట్లు తరలించారు. కాగా ఈ వ్యవహారంపై పూణేలోని పలువురు గుర్తు తెలియని వ్యక్తులతో పాటు ఏఎల్ఎమ్ ట్రేడింగ్ లిమిటెడ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

loader