Case against Asianet News Reporter: ఏషియానెట్ న్యూస్ రిపోర్టర్లు అఖిల నందకుమార్, అబ్జోద్ వర్గీస్, మలయాళం మనోరమా స్పెషల్ కరస్పాండెంట్ జయచంద్రన్ ఇలంకట్‌లపై కేరళ పోలీసుల యాక్షన్‌ను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేస్తూ 137 మంది సాంస్కృతి, సాహిత్య ప్రముఖులు సంయుక్త ప్రకటన చేశారు.
మీడియా పై నిఘా వేయడాన్ని సామాజిక, సాంస్కృతిక, సాహిత్య , మీడియా రంగాలకు చెందిన ప్రముఖులు ఖండించారు. ఇది ప్రజాస్వామిక విలువలకు, పాత్రికేయ స్వేచ్ఛకు విఘాతం అని విమర్శించారు. కథనాలు రాసిన పాత్రికేయులను విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు రావాలని ఒత్తిడి చేయడం సబబు కాదని పేర్కొన్నారు.
ఆయా రంగాల్లోని 137 మంది ప్రముఖులు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఏషియానెట్ న్యూస్ రిపోర్టర్లు అఖిల నందకుమార్, అబ్జోద్ వర్గీస్, మలయాళం మనోరమా (కొల్లాం) స్పెషల్ కరస్పాండెంట్ జయచంద్రన్ ఇలంకట్‌లపై పోలీసుల చర్యలను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. కేరళ మినరల్స్, మెటల్స్ లిమిటెడ్‌లో అవినీతిని వీరు ఎత్తిచూపారని తెలిపారు.
కేరళ మంత్రులు, అధికార సీపీఎం నేతలు పోలీసు చర్యలను సమర్థించడం పౌర సమాజాన్ని కలతలో ముంచిందని వారు తెలిపారు. జర్నలిస్టులపై దర్యాప్తు ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం ప్రయోగించడాన్ని తప్పుపట్టిన వారే నేడు అదే ముప్పును పాత్రికేయులు కలిగించడం దారుణం అని వాపోయారు. భారత్‌లో ప్రభుత్వం, కార్పొరేట్ మీడియా ఔట్‌లెట్లు వాటికవిగా పాత్రికేయ స్వేచ్ఛను పలుమార్గాల్లో అడ్డుకుంటున్నాయని విమర్శించారు. గ్లోబల్ మీడియా ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారత ర్యాంకు 180 దేశాల్లో 161వ స్థానానికి పడిపోయిందని వివరించారు.
పాత్రికేయ స్వేచ్ఛ ప్రజాస్వామిక సమాజానికి, రాజ్యాంగ బద్ధ పౌర హక్కులకు ఆవశ్యకం కావడం ఈ జర్నలిస్టుల పట్ల తమను మాట్లాడేలా చేస్తున్నదని వివరించారు. ఇందుకోసమే సుప్రీంకోర్టు తరుచూ పాత్రికేయ స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అయినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛలోనే ఇమిడి ఉంటుందని పలు రూలింగ్స్‌లో తెలిపిందని పేర్కొన్నారు. మీడియా ప్రొఫెషనల్స్ వారి న్యూస్ సోర్స్‌ను వెల్లడించాలని ఒత్తిడి చేయరాదని కూడా అందులో ఉంటుందని వివరించారు.
Also Read: Adipurush: డైలాగ్‌లు హిందువుల మనోభావాలను గాయపరిచాయి: సినిమాను సమర్థించిన బీజేపీ నేతలపై ఆప్ ఫైర్
కేంద్ర ప్రభుత్వ పాలకులు నియంతృత్వ పాలనా పోకడలనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పాలకులు పాటిస్తుండటం విచారకరం అని ఆ ప్రకటనలో వివరించారు. ఈ పాత్రికేయులపై పోలీసుల చర్యలను వెంటనే ఆపాలని, అందుకు కేరళ పౌర సమాజం కూడా నిరసనలు చేయాలని పిలుపు ఇచ్చారు.
సంయుక్త ప్రకటనపై సంతకాలు పెట్టిన ప్రముఖులు వీరే:
బీఆర్‌పీ భాస్కర్ (సీనియర్ జర్నలిస్టు)
కేజీ శంకరపిళ్లై (కవి)
సీ రాధాక్రిష్ణన్ (నవలాకారుడు, కథకుడు)
బీ రాజీవన్ (రచయిత)
డాక్టర్ ఎం కుంజమన్(ఆర్థిక వేత్త)
కే అజిత (రీసెర్చర్)
ఎంఎన్ కరస్సెరి (రచయిత)
డాక్టర్ ఈవీ రామక్రిష్ణన్ (రచయిత)
కేసీ నారాయణన్ (జర్నలిస్టు)
ఎంజీ రాధాక్రిష్ణన్ (జర్నలిస్టు)
ఎంపీ సురేంద్రన్ (జర్నలిస్టు)
శిహబుద్దీన్ పోయితుంకదావ్
ఉన్ని బాలక్రిష్ణన్ (జర్నలిస్టు)
కాల్పట్ట నారాయణ్ (రచయిత)
పీ సురేంద్రన్ (రచయిత)
ఎన్‌పీ చేకుట్టి (మీడియా వర్కర్)
యూకే కుమారన్ (కథకుడు, నవలాకారుడు)
వీరన్ కుట్టి (కవి)
అన్వర్ అలీ (కవి)
సీఆర్ నీలకందన్ (సామాజిక కార్యకర్త)
ఎం గీతానందన్ (సామాజిక కార్యకర్త)
డాక్టర్ పీకే పోకర్ (రచియత)
సెబాస్టియన్ (కవి)
సావిత్రి రాజీవన్ (కవి)
జే దేవికా (రచయిత, రీసెర్చర్)
డాక్టర్ కేటీ రామ్ మోహన్ (ఆర్థిక వేత్త)
చంద్రామతి (రచయిత)
సాజిత శంకర్ (ఆర్టిస్ట్)
కరుణాకరన్ (కథకుడు)
ప్రసన్న రాజన్ (విమర్శకుడు)
వీఎస్ అనిల్ కుమార్ (నెరేటర్)
డాక్టర్ ఆజాద్ (రచయిత)
డాక్టర్ ఎస్ ఫిసి
జీ దవరాజన్
డాక్టర్ కేఎం శీబా
కేసీ ఉమేశ్ బాబు (కవి)
దామోదర ప్రసాద్ (రచయిత)
ఎన్ సుబ్రమణియన్ (సామాజిక కార్యకర్త)
సీ అనూప్ (నెరేటర్)
సీఎస్ వెంకటేశ్వరన్ (రచయిత)
ఎస్ రాజీవ్
అనిల్ ఈపీ
ప్రమోద్ పుజంకర
జోలీ చిరాయత్
శ్రీధర్ రాధాక్రిష్ణన్
రాజన్ చెరుకాడ్ (జర్నలిస్టు)
ఎన్ శ్రీజిత్ (జర్నలిస్టు)
రవి శంకర్ కేవీ (జర్నలిస్టు)
ప్రొఫఎసర్ కుసుమమ్ జోసెఫ్
మంగద్ రత్నాకరణ్ (మీడియా వర్కర్)
పీపీ సత్యన్ (జర్నలిస్టు)
డాక్టర్ వీ విజయకుమార్ (రచయిత)
ముజఫర్ అహ్మద్ (జర్నలిస్టు)
జ్యోతి నారాయణ్
ఎం సుల్ఫత్
అడ్వకేట్ భద్ర కుమారి
కే హరిదాస్ (రచయిత)
అడ్వకేట్ రమా కేఎం
కే మురళి
జయరాజ్ సీఎన్
డాక్టర్ కేఎన్ అజోయ్ కుమార్
ప్రతాపన్
సీఎస్ మురళీ శంకర్
అడ్వకేట్ సాజి చెరమాన్
సజీవ్ అంతక్కడ్
పురుషన్ ఎలూర్
వినోద్ చంద్రన్
పీకే శ్రీనివాసన్ (జర్నలిస్టు)
శిబురాజ్ (మీడియా వర్కర్)
ప్రియదాస్ జీ మంగలత్
టీకే వినోదన్
పీసీ జోసి (పబ్లిషర్)
జగదీశ్ బాబు (జర్నలిస్టు)
సుధీశ్ రాఘవన్ (నవలాకారుడు)
కేకే సురేంద్రన్
సజీవ్ అంతిక్కడ్
కే సంతోష్ కుమార్
రోబిన్ కేరళ
శరత్ చేలూర్
కేజీ జగదీశన్
ఐ గోపీనాథ
విజయరాఘవన్ చెలియా
డాక్టర్ ప్రసాద్
టీ నారాయణన్ వత్తోలి
డాక్టర్ ఈ ఉన్నిక్రిష్ణన్
అడ్వకేట్ వినోద్ పయ్యడ
ఇజాబిన్ అబ్దుల్ కరీమ్
కబీర్ షా
డాక్టర్ సుగాథన్ (ఢిల్లీ)
పీఎం నారాయణన్ (జర్మన్ టీవీ రిపోర్టర్)
అశోక్ కుమార్
రాజగోపాల్
జీ దిలీపన్ (రైటర్)
ప్రదీప్ పనగాడ్ (రచయిత)
కేఎం వేణుగోపాల్
జంశీన్ ముల్లపాత్ (జర్నలిస్టు)
సీపీ రషీద్
డాక్టర్ ఈ ఉన్నిక్రిష్ణన్
ఏజే థామస్ (కవి)
ప్రేమబాబు
డాక్టర్ ప్రిన్స్ కేజే
రాజీవ్ కుమార్ కే
జైగోష్ ఎంబీ
సుబిన్
షాజి కేవీ (రైట్ టు ఇన్ఫర్మేషన్ అసోసియేషన్)
అడ్వకేట్ చంద్రసేనన్
లిబిన్ తాథ్తపల్లి
ప్రసాద్ సోమరాజన్
పీకే ప్రియేశ్ కుమార్
విల్ఫ్రెడ్ కేపీ (ఆర్టిస్ట్)
అడ్వకేట్ శిజు
వేణుగోపాల్ (రచయిత)
ప్రవీణ్ పిలస్సెరి
ఆదామ్ ఆయుబ్
హరీస్ అబు
ప్రదీప్ కులంగర
మిని మోహన్
ఇందిరా దిలీపన్
అశోక్
కేకే సుదేవ్
ఉదయకుమార్
షెరిన్ వర్గీస్
కుట్టి మూస కేఎం
రెన్సన్
అడ్వకేట్ ఎన్ఎం సిద్దిఖీ
పద్మకుమార్
అనీస్ జార్జ్
కొచుమోన్
రఘు కుమార్
పరమేశ్వర్
పీటీ విజయన్
జోస్ మాథ్యూ
ప్రశాంత్ ఎం ప్రభాకరణ్
సునిల్ కొచ్చి
పీవీ జాను
జుబేర్ సయీద్
అల్బీ
హరిదాస్ టీ
మాథ్యూ కొట్టియుర్
