తిరుచి: తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలుడు దారుణంగా ప్రవర్తించి 9 ఏళ్ల బాలికను పొట్టనపెట్టుకున్నాడు. కామవాంఛతో 14 ఏళ్ల వయస్సు గల బాలుడు 9 ఏళ్ల బాలికను మల్లెపూల తోటలోకి తీసుకుని వెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక భయపడిపోయి ప్రతిఘటించడంతో బాలుడు ఆమె తలపై రాయితో మోదాడు. దాంతో ఆ బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. 

అతను ఏమీ తెలయనట్లు గ్రామంలోకి వచ్చి బాలిక తోటలో పడిపోయి ఉందని చెప్పాడు. ఆమెను గ్రామస్తులు అస్పత్రికి తరలించారు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ సంఘటన తమిళనాడులోని  కృష్ణ సముద్రంలో జరిగింది. 

తొమ్మిదేళ్ల బాలిక స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. ామె పక్కింట్లోని 14 ఏళ్ల బాలుడు అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఆ బాలికపై అతను కన్నేశాడు. మాయమాటలు చెప్పి గ్రామ సమీపంలోని మల్లెపూల తోటకు తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. 

భయంతో బాలిక తప్పించుకునేందుకు ప్రయత్నించింది. దాంతో అతను రాయితో తల వెనక భాగంలో బలంగా కొట్టాడు. పలుమార్లు రాయితో ఆమె తలపై మోదడంతో స్పృహ తప్పి పడిపోయింది. రక్తస్రావం అవుతుండడంతో భయపడి గ్రామానికి పరుగెత్తాడు. 

తోటలో బాలిక పడిపోయిందని గ్రామస్థులకు చెప్పాడు. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన తల్లిదండ్రుకు కూతురు రక్తం మడుగులో కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మరణించింది.

అనుమానంతో పోలీసులు విచారించడంతో బాలుడు తన నేరాన్ని అంగీకరించాడు. బాలుడిని అరెస్టు చేసి జువెనైల్ హోంకు తరలించారు.