Asianet News TeluguAsianet News Telugu

15ఏళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అఘాయిత్యం... పొలాల్లోకి లాక్కెళ్లి, నోట్లో గుడ్డలుకుక్కి పాశవిక అత్యాచారం

బలహీన వర్గాలకు చెందిన ఓ బాలికపై ఓ పెద్దింటి బాలుడు అఘాయిత్యానికి పాల్పడగా గ్రామ పెద్దలు సైతం నిందితుడికే మద్దతుగా నిలిచిన ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

14 years boy raped 15years girl at jharkhand state
Author
Jharkhand, First Published Nov 22, 2021, 9:10 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


ఝార్ఖండ్: తల్లితో కలిసి పొలంపనులకు వెళ్ళిన బాలికను ఓ పద్నాలుగేళ్ల బాలుడు తోటలోకి తీసుకెళ్లి అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఝార్ఖండ్ లో వెలుగుచూసింది. అయితే ఈ అఘాయిత్యానికి పాల్పడింది పెద్దింటి బాలుడు కావడం... బాధిత బాలిక అణగారిన వర్గాలను చెందినది కావడంతో గ్రామపెద్దలు సైతం నిందితుడికే అండగా నిలిచారు. బాలిక శిలానికి వెలకట్టి దారుణానికి పాల్పడిన బాలుడిని కాపాడే ప్రయత్నం చేసారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. jharkhand state లోని గొడ్డా జిల్లా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన పెద్దింటి బాలుడు బబ్లూ(14). అతడు చిన్నతనంలోనే చెడుమార్గాల బాటపట్టి గ్రామంలోని అమ్మాయిలను వేధించేవాడు. అతడి వేధింపుల గురించి గ్రామస్తులందరికీ తెలిసినా పెద్దింటి బాలుడు కాబట్టి ఏమీ అనలేకపోయేవారు. ఇదే అదునుగా బబ్లూ మరింతగా రెచ్చిపోయాడు. 

అదే గ్రామానికి చెందిన సామాన్య రైతు కుటుంబానికి చెందిన బాలికపై ఈ నీచుడి కన్ను పడింది. దీంతో నిత్యం బాలికను వేధించేవాడు. అయితే బాలిక తల్లితో కలిసి పొలానికి వెళ్లగా బబ్లూ కూడా వారిని అనుసరించి వెళ్లాడు. ఈ క్రమంలో అదును చూసుకుని బాలిక ఒంటరిగా వుండగా బలవంతంగా పొలాల్లోకి లాక్కెల్లాడు. అరిచి గోలచేయకుండా నోట్లో గుడ్డలు కుక్కి అత్యంత పాశవికంగా బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

read more  క్షమాపణ చెబుతాను హోటల్ గదికి రమ్మని పిలిచి.. బాలికపై అత్యాచారం, చెబితే చంపేస్తానని బెదిరించి...

అత్యాచారం అనంతరం బబ్లూ అక్కడినుండి పరారవగా బాలిక తల్లివద్దకు వెళ్ళి జరిగిన అఘాయిత్యం గురించి తెలిపింది. దీంతో తల్లి గ్రామంలోకి వెళ్ళి పెద్దలకు విషయం తెలియజేసి పంచాయితీ పెట్టింది. అయితే బబ్లూ కుటుంబాన్ని ఎదురించి అతడికి శిక్ష విధించే దమ్ములేని గ్రామపెద్దలు బాలిక శీలానికి వెలకట్టే ప్రయత్నం చేసారు. దీంతో ఇక గ్రామ పెద్దలతో తమకు న్యాయం జరగదని భావించిన బాధిత బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. 

తన కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు బబ్లూతో పాటు అతడిని కాపాడే ప్రయత్నం చేసిన గ్రామపెద్దలపై కూడా ఆ తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న బబ్లూను అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు. 

read more  దారుణం.. క్వారంటైన్ లో తోటి మహిళా డాక్టర్లపై అత్యాచారం, వీడియో తీసి బ్లాక్ మెయిల్....!!

ఇటీవల మహారాష్ట్రలో ఇలాంటి దారుణమే వెలుగుచూసింది. నిస్సహాయురాలైన ఓ బాలికపై ఏకంగా 400మంది లైంగిక దాడికి పాల్పడి అత్యంత దారుణఘటన బీడ్ జిల్లాలో బయటపడింది. ఇలా బాలికపై అఘాయిత్యానికి పాల్పడినవారిలో ఓ పోలీస్ కూడా వున్నాడు.  ఆరు నెలలుగా తల్లి లేని బాలికపై వీరంతా అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు బయటపడింది. 

బాధితురాలి తల్లి రెండేళ్ల క్రితమే మరణించింది. దీంతో మైనర్ బాలికకు కొంత కాలం తర్వాత తండ్రి పెళ్లి చేశాడు. ఆ బాలిక భర్తతో సుమారు ఏడాది పాటు ఉంది. కానీ అక్కడ మామ వేధింపులు ఎక్కువ అయ్యాయి. దీంతో ఆమె తిరిగి తండ్రి దగ్గరకు వచ్చింది. కొన్ని రోజులు ఇంటిలో ఉన్న తర్వాత తండ్రికి భారంగా మారానని భావించిందో ఏమోగానీ స్వయంగా ఉద్యోగం చేసుకోవాలని నిర్ణయించుకుంది.   అందులో భాగంగానే ఉద్యోగ వేటలో అంబెజోగాయ్ టౌన్‌కు వెళ్లింది. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఆమె కామాంధుల బారినపడింది.

ఉద్యోగం ఇప్పిస్తామనే హామీ ఇచ్చి ఇద్దరు దుండగులు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత చాలా మంది ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా వరుస అత్యాచారాలకు గురయిన బాలిక గర్భం దాల్చడంలో విషయం వెలుగుచూసింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios