Asianet News TeluguAsianet News Telugu

త్రిపురలో 1,385 కిలోల గంజాయి స్వాధీనం, దాని విలువ తెలిస్తే.. దిమ్మతిరగాల్సిందే..

పశ్చిమ త్రిపురలోని ఉరాబరి గ్రామంలో  బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF),  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో వారి వద్ద నుండి 1,385 కిలోల గంజాయి (గంజాయి) స్వాధీనం చేసుకున్నట్లు అధికారి ఆదివారం తెలిపారు.

1385 Kg Marijuana Seized In West Tripura By Border Force, 3 Arrested
Author
First Published Mar 27, 2023, 6:20 AM IST

ఈశాన్య రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల రవాణా తీవ్రమవుతోంది. ప్రతి రోజు ఏదో ఒక చోట భారీగా డ్రగ్స్ , గంజాయి పట్టుబడుతోంది. పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా డ్రగ్స్ ముఠా దొడ్డిదోవలో అక్రమ రవాణాకు పూనుకుంటున్నారు. ఆదివారం ఒక్క రోజే పలుచోట్ల 2 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF),  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) జాయింట్ ఆపరేషన్‌లో వారి వద్ద నుండి 1,385 కిలోల గంజాయి (గంజాయి) స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ ముఠాకు చెందిన పశ్చిమ త్రిపురకు చెందిన ముగ్గురు అనుమానితులను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అదుపులోకి తీసుకుంది. 

వివరాలు ఇలా ఉన్నాయి..  పశ్చిమ త్రిపురలోని ఉరాబరి గ్రామానికి చెందిన అనుమానిత వ్యక్తి ఇంట్లో భారీ గంజాయి నిల్వ ఉన్నట్లు ఆదివారం తెల్లవారుజామున ఇంటెలిజెన్స్ కు సమాచారమందింది. ఈ మేరకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF),  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) జాయింట్ ఆపరేషన్‌లో నిర్వహించింది. ఈ క్రమంలో 1,3నారు85 కిలోల గంజాయి (గంజాయి) స్వాధీనం చేసుకున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) పశ్చిమ త్రిపురకు చెందిన ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసింది.   


పశ్చిమ త్రిపురలోని ఉరాబరి గ్రామానికి చెందిన అనుమానిత వ్యక్తి ఇంట్లో భారీ గంజాయి నిల్వ ఉన్నట్లు ఆదివారం తెల్లవారుజామున అందిన నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ను అనుసరించి ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారి తెలిపారు.ఆపరేషన్ సమయంలో, ఒక వ్యక్తిని పట్టుకున్నట్లు అధికారి తెలిపారు. భద్రతా సిబ్బంది తమదైన శైలిలో ప్రశ్నించగా.. అతను పశ్చిమ త్రిపుర నివాసి,ఇతర సహచరుల ప్రధాన కింగ్-పిన్ పేరును వెల్లడించాడని BSF అధికారిక ప్రకటన తెలిపింది. చిట్కా ప్రకారం గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, బిఎస్ఎఫ్ ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపింది. ముగ్గురు (కింగ్‌పిన్‌తో సహా) నిందితుల ఇళ్లలో రహస్యంగా దాచిన 1385 కిలోల గంజాయి మొత్తం విలువ ₹ 2,07,75,000 (రెండు కోట్లకు పైనే) ఉంటుందని పోలీసుల తెలపారు.

సరిహద్దు భద్రతా దళం త్రిపుర నుండి డ్రగ్స్ ముప్పును నిర్మూలించడానికి , "త్రిపుర - డ్రగ్ రహిత రాష్ట్రంగా" చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉంది. ఫలితంగా, BSF సరిహద్దు స్మగ్లర్లపై ప్రత్యేకించి మాదకద్రవ్యాలు , డ్రగ్స్‌పై ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది . విజయం సాధించిందని BSF తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios