చెన్నై: కాపాడాల్సిన వాడే ఆ బాలికను కాటేశాడు. అభం శుభం తెలియని 13ఏళ్ళ మైనర్ కూతురితో కామవాంఛ తీర్చుకున్నాడు ఓ కసాయి తండ్రి. మానవ సంబంధాలకు మచ్చతెచ్చే ఈ దారుణం తమిళనాడులో చోటుచేసుకుంది. 

తమిళనాడు విల్లుపురం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 13ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతోంది. అయితే నిత్యం మద్యం మత్తులో వుండే బాలిక తండ్రి మానవ సంబంధాలకు మచ్చగా నిలిచేలా వ్యవహరించాడు. బాలికను కాపాడాల్సిన వాడే కామవాంఛతో కాటేయడం ప్రారంభించాడు. ఇంట్లో తల్లి లేని సమయంతో బాలికను బెదిరించి కన్న తండ్రే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

అయితే ఇటీవల బాలిక అస్వస్థతకు గురవడంతో తల్లి హాస్పిటల్ కు తీసుకెళ్లింది. బాలికకు వైద్యపరీక్ష నిర్వహించిన డాక్టర్లు బాలిక గర్భం దాల్చినట్లు తేల్చారు. దీంతో తల్లి బాలికను నిలదీయగా తండ్రి జరిపిన లైంగిక దాడి గురించి వెల్లడించింది. 

దీంతో భర్తపై సదరు తల్లి విల్లుపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు కీచక తండ్రిపై పోక్సో చట్టం కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.