రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లా అంబవాలిలో ఓ ట్రక్కు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రతాప్‌గఢ్-జైపూర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

ఘటనాస్థలిలోనే తొమ్మిది మంది మరణించగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో నలుగురు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన మరో 15 మందిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.