పశ్చిమ బెంగాల్ లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాగా.. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లోని జల్పాయిగురి డిస్ట్రిక్ట్ ధుప్ గురి సిటీలో జరిగింది. కాగా..  స్థానికులు వెంటనే ఈ విషయాలను పోలీసులకు తెలియజేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. కాగా.. పోగ మంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించక పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా గాయాలపాలైన వారిని స్థానికి ఆసుపత్రికి తరలించారు. ‘పొగమంచు కారణంగా కొంత దూరం వరకే రోడ్డు కనిపిస్తుందని, దాని కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. పొగమంచు ఎక్కువగా ఉండటంతో రోడ్డు సరిగా కనిపించలేదు. దాంతో ఈ ఘోరం జరిగింది. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించాం. వారికి ప్రస్తుతం చికిత్స జరుగుతుంద’ని పోలీసులు తెలిపారు. 

ప్రస్తుతం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.