ప్రముఖ పర్యాటక ప్రాంతం సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ జీపు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో అందులోవున్న ప్రయాణికులంతా మృతిచెందారు. 

హిమాచల్ ప్రదేశ్ సిమ్లా జిల్లా సనాలీ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బాగా లోతుగా ఉన్న లోయలో వాహనం పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.