అస్సాంలో దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురవ్వడంతో పాటు చెట్టుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. వివరాల్లోకి వెళితే.. బిశ్వనాథ్ జిల్లా గోహ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్లా గ్రామానికి చెందిన ఏడుగురు విద్యార్ధులు పదో తరగతి చదువుతున్నారు.

Also Read:యువతిపై అత్యాచారం, గర్భం దాల్చడంతో.. శీలానికి వెలకట్టి...

ఈ క్రమంలో శుక్రవారం పరీక్ష రాసిన అనంతరం బాధితురాలిని ఓ విద్యార్ధి తన ఇంట్లో పార్టీకి ఆహ్వానించాడు. అనంతరం అదే రోజు రాత్రి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆమె తన ఇంటికి దగ్గరలోని అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది.

Also Read:ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. 90ఏళ్ల వృద్ధురాలిని కూడా వదలకుండా...

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం నిందితులైన ఏడుగురు విద్యార్ధులును అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము చేసిన నేరం బయటకు వస్తుందని విద్యార్ధులనే బాధితురాలిని చెట్టుకు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా..? లేక అవమానభారంతో బాలికే బలవన్మరణానికి పాల్పడిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.