నోయిడాలో దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. అనంతరం నిందితుడిని భారీ హైడ్రామా మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నాం ఎకోటెక్ 3 పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది.

దీనిపై ఎఫ్ఐఆర్ నమోదవ్వడంతో నిందితులను గుర్తించి బుధవారం వీరిని అదుపులోకి తీసుకున్నారు. నేరం జరిగిన సమయంలో నిందితుడు ఫేస్ మాస్క్ ధరించి ఉండటంతో ఈ సంఘటన పోలీసులకు సవాలుగా మారింది.

బాధితుడు కూడా మొదటిసారి నిందితుడిని చూడటంతో క్లిష్టంగా మారింది. అయితే రంగంలోకి దిగిన పోలీస్ బృందాలు ఎట్టకేలకు నిందితుడిని గుర్తించారు. ఓ పోలీస్ బృందం నిందితుడు ఉన్న స్థానానికి చేరుకోగానే, అతను అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు.

తప్పించుకునే ప్రయత్నంలో పోలీస్ బృందాలపై కాల్పులు జరిపాడు. కానీ పోలీసులు సమయస్పూర్తితో అతనిని అరెస్ట్ చేశారు. మైనర్ బాలిక తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు.

ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగానే ఉందని, వైద్య సహాయం అందిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని డిప్యూటీ కమీషనర్ (వుమెన్ సేఫ్టీ) విృందా శుక్లా వెల్లడించారు.