లోయలో పడ్డ బస్సు: జమ్మూలో 12మంది మృతి

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 21, Aug 2018, 1:27 PM IST
12 killed in Jammu and Kashmir road accident
Highlights

జమ్మూ కాశ్మీర్‌లో మంగళవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మృతి చెందారు.  మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.


జమ్మూకాశ్మీర్: జమ్మూ కాశ్మీర్‌లో మంగళవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మృతి చెందారు.  మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని  కిష్టవార్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. యాత్రికులతో  వెళ్తున్న  బస్సు  దోల్ ఏరియాలో లోయలో పడిపోయింది.  బస్సుపై డ్రైవర్ కంట్రోల్ తప్పిపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు భావిస్తున్నారు. 

 

 

 ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరుతీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు  కొండచరియలు విరిగిపడడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడ పోలీసులు  ఆరా తీస్తున్నారు.  సంఘటన స్థలంలో సహాయక చర్యలను చేపట్టారు.

loader