ఛత్తీ‌స్‌ఘడ్ రాష్ట్రంలో గురువారం నాడు మావోయిస్టులు ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

రాయ్‌పూర్: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో గురువారం నాడు దారుణం చోటు చేసుకొంది. మావోయిస్టులు ఐఈడీ పేల్చివేశారు. ఈ పేలుడుతో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.రాష్ట్రంలోని గోతియా అటవీప్రాంతంలో ఐఈడీ పేల్చారు. ఈ ఘటన తర్వాత పోలీసులు మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మలెవాహి ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు.

Scroll to load tweet…

ఇవాళ ఉదయం దంతేవాడ జిల్లాలోని గోత్రియా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీని పేల్చారు.నారాయణపూర్ జిల్లా నుండి దంతేవాడకు బొలెరో వాహనంలో 12 మంది ప్రయాణిస్తున్న సమయంలో ఈ పేలుడు చోటు చేసుకొంది. ఈ వాహనంలో ప్రయాణీస్తున్న 12 మంది గాయపడ్డారు. గాయపడిన 12 మందిని భద్రతా సిబ్బంది ఆసుపత్రికి తరలించినట్టుగా జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ చెప్పారు.సంఘటన స్థలానికి ఎస్పీ కూడ చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించడంలో సహాయం అందించారు. దంతేవాడ, నారాయణపూర్ దక్షిణ ఛత్తీస్‌ఘడ్ , బస్తర్ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉంటుంది.