ముంబై:మహారాష్ట్రలోని దులే జిల్లా దొండైచ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు, కంటైనర్ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంబవించింది. ఔరంగబాద్ నుండి మహారాష్ట్ర వైపు బస్సు వెళ్తుంది.

ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.