న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి తగ్గుతున్నాయి.రోజువారీ కేసులు కూడ తగ్గాయి. అంతేకాదు దేశంలోని సుమారు 17 రాష్ట్రాల్లో కరోనాతో ఒక్క కేసు కూడ నమోదు కాలేదు.గత 10 రోజులుగా రోజువారీగా  150 కంటే తక్కువగానే కేసులు నమోదౌతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత కేంద్రాల్లో ఒక్క కరోనా కేసు కూడ నమోదు కాలేదు.

అండమాన్ నికోబార్, డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలీ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరం, నాగాలాండ్, లక్షద్వీప్, లడ్ధాఖ్, సిక్కిం, రాజస్థాన్, మేఘాలయ, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఒక్క కరోనా కేసు కూడ నమోదు కాలేదు.

గత 24 గంటల్లో దేశంలో 11,831 కొత్త కేసులు నమోదయ్యాయి. 11,904 కరోనా నుండి కోలుకొన్నారు. రోజువారీ కొత్త కేసులు కేరళ రాష్ట్రంలో నమోదౌతున్నాయి. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 6,075 కేసులు బయటపడ్డాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో  ఒక్కటైన ఇండియాలో  కరోనా కంట్రోల్ లో ఉంది.