నరేంద్రమోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం చైనాకు మరో షాకిచ్చింది. ఇప్పటికే టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్స్‌ను నిషేధించి డ్రాగన్ కంట్రీ ఆర్ధిక మూలాలపై దెబ్బ కొట్టిన భారత్ మరోసారి వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

పబ్జీతో పాటుగా 118 చైనా యాప్స్‌పై నిషేధం విధిస్తున్నట్లుగా ప్రకటించింది. దీనికి సంబంధించి కేంద్ర ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ల నుంచి తొలగించాలని ఆయా సంస్థలను ఆదేశించింది.

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది పబ్‌జీ గేమ్‌ను డౌన్ లోడ్ చేసుకుని ఉంటారని అంచనా. గతంలో గల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణల సమయంలో దేశ భద్రత, రక్షణ దృష్ట్యా టిక్ టాక్ 59 యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

అయితే గత కొర్దిరోజులుగా సరిహద్దుల్లో చైనా దూకుడుగా వ్యవహరిస్తూ ఉండటంతో మరికొన్ని చైనీస్ యాప్‌లపై కేంద్రం వేటు వేసింది.