కేరళలో ఒక్కరోజే కొత్తగా 115 కరోనా కేసులు...

పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని కేరళలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచారు. కేసులను నియంత్రించడానికి తీసుకున్న చర్యల గురించి ఆరోగ్యం మంత్రిత్వ శాఖ ఈ మేరకు సమాచారం ఇచ్చింది.

115 new corona cases in Kerala in one day  - bsb

కేరళ : కేరళలో రోజు రోజుకూ నమోదవుతున్న కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. తాజాగా 115 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కేరళ వ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1749కి చేరింది. అయితే,  దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్యశాఖ అంటోంది.  దేశవ్యాప్తంగా మంగళవారం నాడు మొత్తం 142 కొత్త కేసులు నమోదు అవ్వగా ఇందులో 115 కేసులు కేరళలోనే ఉన్నాయి.

కేరళ కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి పూర్తి సిద్ధంగా ఉందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. గత నెలలో కూడా కేరళలో కరోనా కేసులు పెరిగాయని,  దీంతో మంత్రివర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. 

కరోనా జేఎన్.1 వైరస్ లక్షణాలు ఇవే: వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే?

పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని కేరళలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచారు. కేసులను నియంత్రించడానికి తీసుకున్న చర్యల గురించి ఆరోగ్యం మంత్రిత్వ శాఖ ఈ మేరకు సమాచారం ఇచ్చింది. లక్షణాలు ఉన్న వ్యక్తులను పరీక్షించి, వారి నమూనాలను టెస్టుల కోసం పంపాలని  ఆదేశించినట్లు తెలిపింది. అవసరమైన మందులు తగినంతగా నిల్వ ఉంచామని  తెలిపింది.

డిసెంబర్ 13 నుండి 16 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో.. కరోనాను ఎదుర్కొనే క్రమంలో అవసరపడే ఐసోలేషన్ వార్డులు, ఆక్సిజన్ బెడ్లు, ఐసియు వెంటిలేటర్ల లభ్యతను నిర్ధారించే మాక్ డ్రిల్ లను చేసినట్లుగా వీణ జార్జ్ తెలిపారు. ఇది ఆన్లైన్  మాక్ డ్రిల్ గా నిర్వహించినట్లుగా తెలిపారు. దీంతోపాటు కోవిడ్ పరిస్థితి, దానిని ఎదుర్కొనే సన్నద్ధతను అంచనా వేయడానికి మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. 

మరోవైపు కేరళలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతుండడంతో ఉత్తర ప్రదేశ్ అలర్ట్ అయింది. ఉత్తరప్రదేశ్లో కరోనా హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని అన్ని జిల్లా ఆస్పత్రులు మెడికల్ కాలేజీలలో కరోనా పూర్తి సన్నాహాలు ఉండేలా చూసుకోవాలని ఆదేశించింది ప్రభుత్వం. కొత్తగా ఎవరైనా కోవిడ్ రోగి కనిపిస్తే నమూనాలు జీనోం సీక్వెన్సింగ్ కు పంపాలని ఆదేశించింది యోగి ప్రభుత్వం. 

ఇక రాజస్థాన్ ప్రభుత్వం కూడా కొత్త సబ్ వేరియంట్ జెన్ వన్ పై అప్రమత్తమయింది. రోగులలో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయితే వారి నమూనాలను జీనోం సీక్వెన్సీ కు పంపించాలని ఆదేశించింది. ఐఎల్ఐ శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఆస్పత్రులకు వస్తున్నారు. అయితే, వీరిలో అవసరమైతే నమూనాలు తీసుకోవాలని వారిని నిరంతరం పర్యవేక్షించాలని సూచనలు ఇచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios