తమిళనాడులోని మదుమైలో దుండగులు ఏనుగుకు నిప్పుపెట్టి అతికిరాతకంగా హతమార్చారు. ఈ వరస ఘటనల నేపథ్యంలో.. గజరాజులకు రక్షణ లేకుండా పోతుందనే చర్చ మొదలైంది. ఏనుగులకు పుట్టినిల్లు లాంటి కర్ణాటక రాష్ట్రంలోనే ఆరేళ్లల్లో 78 ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి.
దేశంలో గజరాజులకు రక్షణ లేకుండా పోతోంది. ఎక్కడో ఒక చోటు ఏనుగులు దారుణంగా ప్రాణాలు కోల్పోతున్నాయి. సంవత్సరం క్రితం కేరళలో కడుపుతో ఉన్న ఓ ఏనుగు ప్రాణాలు కోల్పోగా.. ఆ కొద్ది రోజులకే అదే ప్రాంతంలో మరో ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. మానవుల దుశ్చర్య కారణంగానే ఆ ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటన మరవకముందే.. తమిళనాడులో కొద్ది రోజుల క్రితం ఇలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది.
తమిళనాడులోని మదుమైలో దుండగులు ఏనుగుకు నిప్పుపెట్టి అతికిరాతకంగా హతమార్చారు. ఈ వరస ఘటనల నేపథ్యంలో.. గజరాజులకు రక్షణ లేకుండా పోతుందనే చర్చ మొదలైంది. ఏనుగులకు పుట్టినిల్లు లాంటి కర్ణాటక రాష్ట్రంలోనే ఆరేళ్లల్లో 78 ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి.
ఇందులో క్రిమిసంహార మందు పెట్టడం, కరెంటు షాక్‌లు, తుపాకులతో కాల్చడం వంటి ఘటనలు ఉన్నాయి. ఆరేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 471 ఏనుగులు మరణించగా, అందులో 393 సహజ మరణాలు, 78 అసహజ మరణాలుగా గుర్తించారు. పంటలపై ఏనుగులు దాడి చేస్తున్నాయని రైతులు వాటిని హతమార్చడానికి కూడా వెనుకాడడం లేదు.
కర్ణాటకలో ఆరేళ్లలో ఏనుగుల మరణాలు
2014–15 మధ్య కాలంలో 77 ఏనుగులు సహజంగా మరణించగా.. మరో 18 మానవ తప్పిదాలకు బలి అయ్యాయి.
2015–16 కాలంలో 59 ఏనుగులు మరణించగా.. మరో 15 అసహజ మరణాలుగా నమోదు చేశారు.
2016–17 మధ్య కాలంలో 90 ఏనుగులు సహజంగా మరణించగా.. మరో 10 మానవ అకృత్యాలకు బలి అయ్యాయి.
2017–18 మధ్యలో 67 ఏనుగులు సాధారణంగా మరణించాయి. మరో 11 ఏనుగులు అసహజంగా చనిపోయాయి.
2018–19 మధ్య కాలంలో 59 ఏనుగులు సహజంగా.. 15 ఏనుగులు అసహజరంగా మరణించాయి.
2019–20 కాలంలో 41 ఏనుగులు మామూలుగా మరణించాయి. మరో 9 ఏనుగులు ఇతర కారణాలతో ప్రాణాలు వదిలాయి.
