బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని  చిక్‌బల్లాపురంలో బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 12మంది మృతి చెందారు.  

టాటా ఏస్ వాహనం ప్రైవేట్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో  12 మంది మృతి చెందారు. చింతమణి నుండి మరుగుమల్లకు వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.  గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.

కోలార్ నుండి చిక్‌బల్లాపూర్ వైపు బస్సు వెళ్తోంది.  టాటా ఏస్‌లో 25 మంది ప్రయాణీస్తున్నారు.  మృతి చెందిన వారిలో 12 మంది ఉన్నారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులు క్షతగాత్రులను చింతమణి, కోలార్ ఆసుపత్రులకు తరలించారు.