జమ్మూకశ్మీర్ లోని రాంబస్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న ఎస్ యూవీ కారు.. అదుపు తప్పి.. లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 11మంది మృత్యువాతపడ్డారు. కాగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో వాహనంలో దాదాపు 15మంది ఉన్నట్లు తెలుస్తోంది.