Asianet News TeluguAsianet News Telugu

మెగా సంస్థ దాతృత్వం.. థాయ్‌లాండ్ నుండి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు..

దేశంలో నానాటికీ కరోనా మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఆక్సీజన్ కొరత తీర్చడానికి మెగా సంస్థ తనవంతు సాయంగా క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ల దిగుమతిక నడుం బిగించింది. 

11 cryogenic oxygen tankers from Thailand coming to india - bsb
Author
Hyderabad, First Published May 22, 2021, 12:26 PM IST

దేశంలో నానాటికీ కరోనా మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఆక్సీజన్ కొరత తీర్చడానికి మెగా సంస్థ తనవంతు సాయంగా క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ల దిగుమతిక నడుం బిగించింది. 

దీంట్లో భాగంగానే భారత్ కు థాయ్‌లాండ్ నుండి మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు రానున్నాయి.యుద్ధ ప్రతిపాదికన 11  క్రయోజనిక్ ట్యాంకుల దిగుమతి చేసుకుంటున్నారు. 

ఒక్కో క్రయోజినిక్ ట్యాంకర్ లో 1.40లక్షల (కోటీ నలభై లక్షల ) లీటర్ల ఆక్సిజన్ వుంటుంది. దేశంలో తొలిసారిగా అధికసంఖ్యలో దిగుమతి. సామాజిక సేవ బాధ్యత లో ‌భాగంగా MEIL మేఘా ఇంజనీరింగ్ సంస్థ థాయ్‌లాండ్ నుండి ఆక్సిజన్ టాంకర్లను  భారత్ కు దిగుమతి చేస్తున్నారు.

తమవంతు‌ బాధ్యతగా ఉచితంగా 11టాంకర్లను థాయ్‌లాండ్ నుండి దిగుమతి చేసిన మేఘా సంస్థ. తొలి విడతగా ఆర్మీ విమానంలో 3 ట్యాంకుల వస్తున్నాయి.

తొలిదశలో  ఇవ్వాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు ప్రత్యేకంగా డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకోనున్నాయి.

ఈ ట్యాంకర్లను ప్రభుత్వానికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఉచితంగా ఇవ్వనుంది. ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యంగా ఈ పని చేపట్టినట్టు మెగా సంస్త ప్రకటించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios