ఆల్ ఖైదా బారీ కుట్రను ఎన్ఐఎ భగ్నం చేసింది. దేశవ్యాప్తంగా దాడులకు ప్రణాళికలు రచిస్తున్న 9 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. కేరళ, పశ్చిమ బెంగాల్ ల్లో ఈ అరెస్టులు జరిగాయి.

న్యూఢిల్లీ: ఉగ్రవాదుల భారీ కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) భగ్నం చేసింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించాలని ఉగ్రవాదుల కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి 9 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదులను అరెస్టు చేసింది. 

కేరళలోని ఎర్నాకులంలో, పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాదులో ఎన్ఐఐ దాడులు నిర్వహించింది. కరేళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేయాలని ఆల్ ఖైదా ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారం అందడంతో ఎన్ఐఏ సోదాలు నిర్వహించిందని

కీలకమైన ప్రదేశాల్లో ఆల్ ఖైదా ఉగ్రవాదులు పథక రచన చేస్తున్నారని, అమాయకులను చంపాలని, తద్వారా ప్రజల్లో భయాందోళనలు కలిగించాలని ఆల్ ఖైదా ఉగ్రవాదులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని ఎన్ఐఏ అధికారిక ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఎర్నాకులంలో ఆరుగురిని, ముర్షిదాబాద్ లో ముగ్గురిని ఎన్ఐఏ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా ఉగ్రవాదలు భారీ కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది.