ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్న 103 మందికి కరోనా సోకింది.ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో చోటు చేసుకొంది.
బెంగుళూరు: ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్న 103 మందికి కరోనా సోకింది.ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో చోటు చేసుకొంది.బెంగుళూరులోని బొమ్మనహళ్లిలోని అపార్ట్ మెంట్ లో ఈ నెల 4వ తేదీన పార్టీ జరగింది. ఈ అపార్ట్‌మెంట్ లోని పార్టీ చేసుకొన్న వారిలో కొందరు డెహ్రాడూన్ వెళ్లేందుకు గాను కరోనా టెస్టులు చేసుకొన్నారు.
ఈ టెస్టుల్లో చాలా మందికి కరోనా సోకిందని తేలింది. దీంతో బెంగుళూరు మహానగర పాలికె అధికారులను అపార్ట్ మెంట్ అధికారులను అపార్ట్ మెంట్ వాసులు సంప్రదించారు. మున్సిపల్ అధికారులు అపార్ట్ మెంట్ వాసులకు పరీక్షలు నిర్వహించారు. అపార్ట్ మెంట్ లోని 1052 మందికి పరీక్షలు నిర్వహిస్తే 103 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.
కరోనా సోకినవారిలో 96 మంది అరవై ఏళ్లకు పైబడినవారేనని బీబీఎంసీ కమిషనర్ మంజునాథ్ తెలిపారు.కరోనా సోకినవారిలో ఒకరు ఆసుపత్రిలో చేరారు. మిగిలిన వారిని ఐసోలేషన్ లో ఉంచారు.కరోనా సోకినవారిలో చాలా మందికి లక్షణాలు లేవని బీబీఎంసీ అదనపు కమిషనర్ రామకృష్ణ తెలిపారు.
ప్రభుత్వ నియమాల మేరకు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు అధికారులు. బాధిత కుటుంబాలకు అవసరమైన సరుకులను అందిస్తున్నామని కమిషనర్ చెప్పారు.
